ఈ రాశులవారికి స్నేహితులుంటారు కానీ ఉత్తమ స్నేహితులు ఉండరంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఆ రాశులేంటో ఎందుకో ఇక్కడ తెలుసుకోండి....
మేష రాశి ఈ రాశివారిది మంచి వ్యక్తిత్వం, దృఢ నిశ్చయంతో ఉంటారు. వీరికి ఉత్తేజకరమైన స్నేహితులుంటారు. కానీ వీరి హఠాత్తు స్వభావం... అభిప్రాయాలు వెంటనే మారిపోతుంటాయి. అందుకే వీళ్లతో స్నేహం కొనసాగించేవారి సంఖ్య తక్కువ.
మిథున రాశి వీరికి స్నేహితులు చాలామంది ఉంటారు కానీ క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువే ఉంటారు. అందరితో కలసిపోయి సరదాగా ఉంటారు. ఎక్కువ మందితో స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి కానీ నిజమైన స్నేహితులు వీరికి దొరకడం కష్టమే. ఎవ్వరితోనూ పూర్తిగా ఉండరు.
కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కుటుంబ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఏ మాత్రం టైమ్ దొరికినా కుటుంబ సభ్యులకే టైమ్ కేటాయిస్తారు. సమాజంలో బాగానే కనెక్ట్ అవుతారు. ఎక్కువ మందితో పరిచయాలుంటాయి కానీ ఎవ్వరితోనూ క్లోజ్ గా ఉండరు.
సింహ రాశి సింహరాశి వారు ఆకర్షణీయంగా, నమ్మకంగా కనిపిస్తారు. వీళ్లతో స్నేహం చేయాలని అందరూ అనుకుంటారు కానీ వీళ్ల తీరు గమనించాక దూరమైపోతారు. వ్యక్తిగత లాభం కోసం పరిస్థితులను తారుమారు చేసే ధోరణి కలిగి ఉంటారు.
తులా రాశి తులారాశి వారు సంబంధాలలో సామరస్యం కోరుకుంటారు. అయినప్పటికీ ఈ రాశివారిలో ఎక్కువ మంది అవసరం కోసం మాత్రమే స్నేహం చేస్తారట. నిజాయితీగా ఉండడం కన్నా ఎదుటివారితో వివాదాలు లేకుండా గడిచిపోతే చాలనుకుంటారట.
ధనస్సు రాశి ధనుస్సు రాశివారు సాహసోపేతంగా ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరిస్తారు. వీరిలో చంచలత్వం ఎక్కువ. శాశ్వత స్నేహం అంటే ఈ రాశివారికి సవాలే అని చెప్పాలి. ఈ రాశివారు దృఢమైన కనెక్షన్ కొనసాగించడం కన్నా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారట.
కుంభ రాశి కుంభ రాశి వారు చాలామంది అంతర్ముఖులు. అంటే ఏ విషయం బయటకు చెప్పకుండా లోపలే దాచేసుకుంటారు. ఏ విషయంలోనూ ఇతరుల ముందు ఓపెన్ అవరు. పైకి స్నేహం చేస్తున్నట్లు ఉన్నా లోపల మాత్రం ఏదో విషయంలో ఆందోళన చెందుతారు.
మీన రాశి మీన రాశి వారు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇతరుల ముందు సులభంగా ఓపెన్ అవ్వరు. అందుకే వీరితో స్నేహం చేద్దామని ప్రయత్నించే వారు కూడా వీరి ధోరణి ఆర్థం చేసుకోలేక దూరమైపోతారట