మేషం నుంచి మీనం వరకూ ఆగష్టు 2 రాశిఫలాలు



మేష రాశి
ఈ రోజు చాలా సమయం ఆత్మపరిశీలనలో గడుపుతారు. ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారంలో కొంత లోటు ఉంటుంది. వివాహ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు సహోద్యోగుల నుంచి సహాయం పొందవచ్చు.



వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు కష్టపడి పని చేస్తేనే విజయం సాధిస్తారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దు. పనిపై పూర్తిస్తాయిలో శ్రద్ద పెట్టలేరు. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకునేందుకు ఇదే మంచి సమయం. అవసరాలకు మించి డబ్బు ఖర్చు చేయకండి.



మిథున రాశి
ఈ రాశివారు ఆన్‌లైన్ కమ్యూనికేషన్ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. పనిచేసే ఓపిక లేకపోవడం వల్ల ముఖ్యమైన అవకాశాలను కోల్పోతారు. మీ మాటతీరుని మార్చుకోవాలి. పనికిరాని కొన్ని కార్యకలాపాలపై శ్రద్ధ చూపిస్తారు.



కర్కాటక రాశి
పాత అప్పులు తీర్చడానికి ఈ రోజు చాలా మంచిది. ఇంటిలోని అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలను తప్పకుండా తీసుకోవాలి. చిల్లర వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. మీ ఉత్పత్తుల నాణ్యతపై శ్రద్ధ వహించండి.



సింహ రాశి
ఈ రాశి వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాల్లో రాణిస్తారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు జాగ్రత్తగా ప్రకటనలు చేయాలి. సమాజంలో మీ గౌరవం గురించి మీరు ఆందోళన చెందుతారు. ఉద్యోగులు సీనియర్ అధికారులతో వాదించకండి.



కన్యా రాశి
వ్యాపార భాగస్వామ్యం ఉండే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు జాగ్రత్తగా ప్రకటనలు చేయాలి. సమాజంలో మీ గౌరవం గురించి మీరు ఆందోళన చెందుతారు. ఎలక్ట్రికల్ పరికరాలలో లోపాలు సంభవించవచ్చు.



తులా రాశి
నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. తెలియని వ్యక్తులతో ప్రయాణం చేయవద్దు. మీరు దీర్ఘకాలిక లక్ష్యం కోసం ప్లాన్ చేస్తారు. అడగకుండా ఎవరికీ సలహాలివ్వకండి.



వృశ్చిక రాశి
ఈ రాశివారు కష్టంగా భావించిన పనిని కూడా తేలికగా చేస్తారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. జ్ఞానుల సలహాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోండి. సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యక్తులు మంచి విజయాన్ని పొందవచ్చు.



ధనుస్సు రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఒత్తిడి మిమ్మల్ని శాసిస్తుంది. ఎవ్వరికీ అప్పు ఇవ్వొచ్చు, తీసుకోవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అసరం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాలలో అజాగ్రత్త వద్దు



మకర రాశి
సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.



కుంభ రాశి
ఒకేసారి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. స్నేహితులను గుడ్డిగా నమ్మవద్దు. మీ ఫోన్ పాడై ఉండవచ్చు. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. మానసిక రుగ్మతల వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి సమయం.



మీన రాశి
భాగస్వామ్య వ్యాపారంలో విశేష పురోగతికి అవకాశం ఉంది. ప్రేమ ప్రతిపాదనలు అందుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. మీరు కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు. ఇప్పుడు పెట్టే నూతన పెట్టుబడులు రానున్న రోజుల్లో లాభాలనిస్తాయి.