మేషం నుంచి మీనం వరకూ జూలై 31 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశివారిలో ఈ రోజు ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుని సహాయంతో నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది



వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. భవనం నిర్వహణ, అలంకరణ పనులపై ఖర్చులు పెరగొచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.



మిథున రాశి
ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఉన్నత విద్య, పరిశోధన పనుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సహకారం ఉద్యోగులకు ఉంటుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి.



కర్కాటక రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ మాటల్లో మాధుర్యం నిండి ఉంటుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది.



సింహ రాశి
ఈ రాశివారి కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు పనిప్రదేశంలో శ్రమ పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి.



కన్యా రాశి
అనవసరమైన కోపం, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంతో కలిసి మతపరమైన స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీలో ఆత్మవిశ్వాసం నిండిఉంటుంది. ఆదాయ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.



తులా రాశి
ఈ రాశివారి ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు మీపై ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.



వృశ్చిక రాశి
ఈ రాశివారి మాటల్లో మాధుర్యం ఉంటుంది. పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ గా ఉంటారు. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. రచన, మేధోపరమైన పనుల్లో నిమగ్నమైఉంటారు. పాత స్నేహితుడిని కలుస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాల్సి రావొచ్చు.



ధనుస్సు రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో చాలా మార్పులొస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.



మకర రాశి
ఈ రాశివారు ప్రశాంతంగా ఉంటారు. కోపం తగ్గించుకుని మాటల్లో సున్నితత్వం ఉండేలా జాగ్రత్తపడండి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. మీపై ప్రతికూల ఆలోచనల ప్రభావం ఉంటుంది.



కుంభ రాశి
ఈ రాశివారికి చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి.



మీన రాశి
ఈ రాశివారికి మనసులో ఏదో నిస్పృహ ఉంటుంది. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. చేసే పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెడతారు. వైవాహిక జీవితం బావుంటుంది.