జూలై 30 న్యూమరాలజీ



నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
మీరు పుట్టిన తేదీ 1,10,19, 28 అయితే న్యూమరాలజీ ప్రకారం మీ నంబర్ 1. జూలై 30న మీ కెరీర్‌లో కొత్త శుభవార్తలను పొందవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మాటలకు దూరంగా ఉండండి, వారితో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి.



నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
మీ పుట్టిన తేదీ 2, 11, 20, 29 అంటే మీ రాడిక్స్ 2. ఈ తేదీల్లో జన్మించినవారు కూడా ఈ రోజు ఓ గుడ్ న్యూస్ వింటారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. అయితే అనవసరమైన డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి.



నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో జన్మించినవారికి జూలై 30న కెరీర్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదు.



నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో జన్మించినవారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది.



నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
కెరీర్ పరంగా ఈ రోజు మీకు చాలా బావుంటుంది. కొత్త ప్రాజెక్టులకో పెట్టుబడులు పెడతారు. నూతన ప్రణాళికలు అమలు చేయడంలో సక్సెస్ అవుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబం సంబంధాలు బావుంటాయి



నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
సంఖ్యా జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ పుట్టిన తేదీ 6, 24 లేదా 15 అయితే మీ నంబర్ 6. ఈ రోజు ఈ తేదీల్లో జన్మించిన వారికి మిశ్రమఫలితాలుంటాయి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు.



నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు సమస్యల పరిష్కారానికి మీ ఆలోచననే అమలు చేయండి. ఇతరుల ఆలోచనలు మీకు అంతగా కలసిరాకపోవచ్చు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంద.



నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో జన్మించినవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలుంటాయి. పెద్దల సలహాలతో ముందుకు వెళ్లండి. ఓపికగా పనిచేయడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం



నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈరోజు వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయవచ్చు. ధనలాభం ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది.



Images Credit: Pinterest