జూలై 28 న్యూమరాలజీ



నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
మీ పుట్టిన తేదీ 1, 10, 19 మరియు 28 అయితే జూలై 28న మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ రోజు అదృష్టం మీకు కలిసొస్తుంది. తలపెట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. మీ ప్రియమైన వ్యక్తికి సమయం కేటాయించండి.



నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ తేదీల్లో పుట్టినవారు చాలా అవకాశాలు పొందుతారు. ఆర్థిక విషయాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రియమైనవారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోండి. మీ మాటతీరుని మార్చుకునేందుకు ప్రయత్నించండి.



నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో జన్మించిన వారికి ఈ రోజు మంచి ఫలితాలుంటాయి. మీరు ప్రారంభించిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. మీ ప్రయత్నాలకు తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులలు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి.



నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ తేదీల్లో పుట్టినవారు ఈ రోజు మాటలు తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఎదురైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. చిన్న చిన్న విషయాలకే భావోద్వేగానికి లోనవుతారు.



నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
మీరు పుట్టిన రోజు 5, 14, 23 అయితే మీ లక్కీ నంబర్ 5. ఈ రోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. విద్యార్థులు ఈ రోజు కొత్త లక్ష్యాలు చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల సలహాలు స్వీకరించండి.



నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
న్యూమరాలజీ ప్రకారం మీ పుట్టిన తేదీ 6, 15, 24 అయితే ఈ రోజు మీరు ఖర్చులు పెరుగుతాయి. అవసరం లేనివాటికోసం ఎక్కువ సమయం పెట్టొద్దు. కష్టపడి పని చేయండి, అదృష్టం మీ వెంట ఉంటుంది.



నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
సంఖ్యాశాస్త్ర జ్యోతిషశాస్త్రం ప్రకారం మీరు జన్మించిన తేదీ 7, 16, 25 అంటే మీ నంబర్ 7. ఈ రోజు మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంతమిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది.



నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
న్యూమరాలజీ ప్రకారం, పుట్టిన తేదీ 8, 17, 26 ఉన్న వ్యక్తులు జూలై 28న కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ కి సంబంధించి నూతన ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులు పనిలోనే దైవాన్ని వెతుక్కోవాలి.



నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో పుట్టినవారు మీకోసం మీరు టైమ్ కేటాయించుకోండి. మీ వ్యక్తిత్వం అందర్నీ ఆకర్షిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. మీ అదృష్ట సంఖ్య: 7 అదృష్ట రంగు: కుంకుమపువ్వు