జూలై 27 న్యూమరాలజీ



నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులకు జూలై 27 కలిసొస్తుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా డబ్బు పొందుతారు. తెలివిగా ఖర్చు చేయండి. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం తగదు. మీ లక్కీ నంబర్ 21, కలిసొచ్చే రంగు ఆరెంజ్



నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఈ రోజు మీ లక్కీ నంబర్ 11, కలిసొచ్చే రంగు బ్రౌన్.



నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఇంటికి సంబంధించిన పనులపై బిజీగా ఉంటారు. ఏదో విషయంలో గందరగోళానికి గురవుతారు. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. మీ అదృష్ట సంఖ్య: 19 అదృష్ట రంగు: ఆకుపచ్చ



నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
4, 13, 22, 31 జన్మించిన వ్యక్తుల రాడిక్స్ 4...మీరు ఈ రోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. రోజంతా ప్రశాంతంగా ఉంటారు. మీ ఆనందం రెట్టింపు అవుతుంది. మీ లక్కీ నంబర్ 23, కలిసొచ్చే రంగు పసుపు.



నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఈ తేదీల్లో జన్మించినవారు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ తోడబుట్టినవారి కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ మనసులో చింతలను ఎవరితోనైనా పంచుకుంటే తీరుతాయి. మీ లక్కీ నంబర్ 9, సంతోషకరమైన రంగు కుంకుమ రంగు.



నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ తేదీల్లో జన్మించినవారు ఈ రోజు ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. వైవాహిక బంధం, ప్రేమ బంధం బలంగా ఉంటుంది. ఎప్పటినుంచో చెప్పకుండా దాచిన ఆలోచనలను పంచుకోవాలి. అదృష్ట సంఖ్య : 16 అదృష్ట రంగు: బ్లూ



నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీల్లో జన్మించినలవారు ఈ రోజు కుటుంబానికి కొంత సమయం కేటాయించాలి. వాళ్ల అవసరాలేంటో తెలుసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టంది. అతి ఉదారత్వం మానుకుంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య: 18 అదృష్ట రంగు: గ్రే



నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో పుట్టినవారు తమ ప్రియమైన వారిని కలుసుకుంటారు. అనుకోకుండా చేసే ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యులతో స్పెండ్ చేసే సమయం మీకు కొత్త శక్తిని ఇస్తుంది. మీ హ్యాపీ నంబర్: 6 హ్యాపీ కలర్: రెడ్



నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయ వ్యవహారాలతో పాటూ కుటుంబ వ్యవహారాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. కొత్త ఇల్లు లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేయవచ్చు. మీ సంతోషకరమైన సంఖ్య: 29 సంతోషకరమైన రంగు: పింక్