జూలై 23 నుంచి 29 వారఫలాలు



మేషరాశి
ఈ వారం మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీపై మీశ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. తలపెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మంచి ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునేందుకు ఇదే మంచి సమయం. ఈ వారం తీసుకునే నిర్ణయాలు మీకు బాగా కలిసొస్తాయి.



వృషభ రాశి
ఈ వారం ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులుక ఈ వారం ప్రత్యేకంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు.



మిధునరాశి
ఈ వారం సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోవాలి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం ఇది. ఉద్యోగులు మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తారు.



కర్కాటక రాశి
ఈ వారం ఈ రాశివారి ఆరోగ్యం బావుంది.ఈ వారం మీరు పెట్టబోయే పెట్టుబడులు భవిష్యత్ లో మంచి లాభాలనిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి అడుగేయండి. సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులను కలుస్తారు.



సింహ రాశి
ఈ వారం సింహరాశివారికి ఒత్తిడి తప్పదు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. లేదంటే ఆ తర్వాత పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఎవరినీ అవసరానికి మించి విశ్వసించవద్దు. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.



కన్యా రాశి
ఈ రాశివారికి ఈ వారం మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీరు మీ అలవాట్లలో కొన్నింటిని మెరుగుపరచుకోవాలి. మీ ఖర్చులు చాలా వరకు పెరగుతాయి. ఆర్థిక జీవితంలో కొనసాగుతున్న సంక్షోభం మీ కుటుంబ సభ్యుల ముందు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.



తులా రాశి
ఈ రాశివారు కెరీర్‌ని మెరుగుపరచుకోవడంలో ఈ వారం సక్సెస్ అవుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. రానున్న కాలంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ తోబుట్టువులు మీకు కొన్ని పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు.



వృశ్చిక రాశి
ఈ వారం మీ ఆర్థికర పరిస్థితి క్షీణించవచ్చు. ఇతరుల సమస్యల మీరు తప్పుగా ఆలోచిస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించి ఏదైనా విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు మీ అవగాహనను సరిగ్గా చూపించండి



ధనుస్సు రాశి
ఈ వారం మీరు మీ దినచర్యతో విసుగు చెందుతారు. కొన్ని లావాదేవీలకు సంబంధించిన విషయాలలో వీలైనంత అప్రమత్తంగా ఉండండి. మీరు మీ కెరీర్‌లో చాలా విజయాలను పొందుతారు. ఉద్యోగులకు జీతంలో పెరుగుదల ఉంటుంది.



మకర రాశి
ఈ రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఈ వారం మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. గతంలో మీ జీవితంలో ఉండే రహస్యనాలను వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు బయటపెట్టడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.



కుంభ రాశి
ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఇబ్బందుల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. బుధుడు సప్తమంలో ఉండటం వల్ల ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఈ వారం విజయం సాధిస్తారు.



మీన రాశి
ఈ వారం ఈ రాశివారు బిజీ బిజీగా ఉంటారు. ఆర్థిక సమస్యలకు సంబంధించి ఈ వారం ప్రారంభంలో మీకు అనుకూలంగా ఉండవచ్చు కానీ వారం చివరిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి.


Thanks for Reading. UP NEXT

ఈ నెలలో జన్మించినవారు విలాసంతమైన జీవితం గడుపుతారు

View next story