మేషం నుంచి మీనం వరకూ జూలై 22 రాశిఫలాలు



మేష రాశి
మేషరాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది కానీ తలపెట్టిన పనులు పూర్తికావడం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. కుటుంబానికి సమయం కేటాయించండి.



వృషభ రాశి
ఈ రాశివారి ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది లేదంటే ఆ ప్రభావం మీ కుటుంబంపై పడుతుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. వ్యాపారులకు ఈరోజు పెద్దగా కలసిరాదు.



మిధున రాశి
మిథున రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. మీ మాటదూకుడు, కోపం నియంత్రించుకుంటే మంచిది. మీకు కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మీ కన్నా పెద్దవారా చిన్నవారా అనే విషయం మీరు మర్చిపోతారు. ధనలాభం ఉంటుంది.



కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఏదో ఒక విషయంలో చాలా టెన్షన్ పడతారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు మితిమీరిన స్నేహంతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. డబ్బు, మాట రెండూ పొదుపుచేయడం మంచిది.



సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా మానసిక సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి,



కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది.ఈ రోజు మీరు మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తారు. కొన్ని విషయాల్లో కోపంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి.



తులా రాశి
తుల రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తమ పనిని పూర్తిచేస్తారు. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉండొచ్చు.ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచిస్తారు. వైవాహిక సంబంధం బావుంటుంది.



వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని సంప్రదించాకే ఏపనైనా చేస్తారు కానీ మీలోనే క్రమ శిక్షణా లోపం ఉంటుంది.



ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈరోజు మంచి రోజు కానుంది. అనుకోని ప్రయోజనం పొందుతారు. అయితే విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న విషయాన్ని నిర్లక్ష్యంగా వదిలేయకండి వైద్యుడిని సంప్రదించండి.



మకర రాశి
మకర రాశి వారు ఈ రోజు అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. కొత్తగా ప్రారంబించాలి అనుకునే పనులు ఆ రోజు మొదలుపెడితే తక్కువ సమయంలోనే పూర్తవుతాయి.



కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈరోజు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. చేపట్టిన పనులు మాత్రం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. కుటుంబానికి సమయం కేటాయించండి. అనవసర ఖర్చులు, అనవసర మాటలు తగ్గించుకుంటే మంచిది.



మీనరాశి
మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది, ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రారంభించిన పనులు మాత్రం మధ్యలోనే ఆగిపోతాయి. కుటుంబ బాధ్యతలు విస్మరిస్తారు.