మేషం నుంచి మీనం వరకూ జూలై 17 రాశిఫలాలు



మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉంటాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో గొడవ జరిగే అవకాశం ఉంటుంది. తొందరపడి మాట తూలకండి.



వృషభ రాశి
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అది తిరిగి పొందడం కష్టమవుతుంది.



మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారికి సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికే విషయాల్లో జాగ్రత్త వహించండి. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది.



కర్కాటక రాశి
ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకోకుండా పెద్దమొత్తంలో డబ్బు అందుకునే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకోవాలి, భవిష్యత్ కోసం డబ్బులు ఆదాచేయాలి.



సింహ రాశి
ఈ రాశికి చెందిన రాజకీయనాయకులు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. మీ అవసరాలకు ఖర్చులు చేస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది.



కన్యా రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలపై ఆందోళన చెందుతారు. తొందరపడి నిర్ణయం తీసుకుంటే సమస్యలు పెరుగుతాయి. విపత్కర పరిస్థితుల్లో ఓపికగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది.



తులా రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ కీర్తి మరియు గౌరవం పెరగడం వల్ల సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి.



వృశ్చిక రాశి
ఆర్థిక పరంగా ఈ రోజు మీకు మంచి రోజు. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతుంటే ఈ రోజు మీ ఆందోళనలు తొలగిపోతాయి. సోదరులు, సోదరీమణుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది.



ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఇంటి నిర్వహణ కోసం ఖర్చుచేస్తారు. మీ మాటల్లో మాధుర్యాన్ని కాపాడుకోండి. స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగులు పనిపై మరింత అవగాహన పెంచుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.



మకర రాశి
ఈ రోజు ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులుంటాయి. పరిమిత ఆదాయం కారణంగా ఖర్చు చేయడానికి వెనకాడతారు. ఆర్థిక స్థితిని పెంచుకునేందుకు చాలా కష్టపడతారు.



కుంభ రాశి
ఈ రోజు మీరు తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆస్తిని కొనాలన్నా అమ్మాలన్నా ఈ రోజు మీకు మంచి రోజు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.



మీన రాశి
ఈ రాశి వ్యాపారులు ఈ రోజు వ్యాపారంలో పెద్ద లాభాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది. స్వల్ప ప్రయోజనాలకోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి.


Thanks for Reading. UP NEXT

వారఫలాలు జూలై 17 to 23

View next story