వారఫలాలు జూలై 17 to 23



మేషరాశి
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. పనిలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీ విషయాలను మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. అనుకోని అతిథులు రావొచ్చు. పనుల్లో పురోగతి ఉంటుంది.



వృషభ రాశి
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సరైన ప్రణాళికతో అడుగేస్తేనే అన్నింటా విజయం సాధిస్తారు.



మిథున రాశి
ఈ వారంలో మీరు గతంలో ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందుతారు. ఈ రాశి విద్యార్థులు చదువు విషయంలో చాలా ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆదాయం బాగానే ఉంటుంది.



కర్కాటక రాశి
ఈ వారం మీ స్వభావంలో అస్థిరత కనిపిస్తుంది. మీ ఇంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు పొందడంలో మాత్రం గడిచిన వారం కన్నా ఈ వారం మీకు మెరుగ్గా ఉంటుంది.



సింహ రాశి
ప్రతికూల అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో మీరు సిద్ధహస్తులు. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం అనుకూల సమయం.



కన్యా రాశి
ఈ రాశివారు ఆరోగ్యంపై అస్సలు నిర్లక్ష్యం వహించవద్దు. కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలగాలి. విద్యార్థులు కష్టాన్ని మాత్రమే నమ్ముకోండి. ఈ వారం వ్యాపారవేత్తలకు శుభసమయం.



తులా రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ వారం మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో మీ గౌరవం దెబ్బతింటుంది. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.



వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ వారం ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇతర ఆదాయ మార్గాలను కూడా వెతుక్కోవాలి. ఈ సమయంలో మీరు తలపెట్టే పనులకు కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ పూర్తిచేయగలుగుతారు.



ధనస్సు రాశి
ఈ వారం ఈ రాశివారి ఖర్చులు స్వల్పంగా పెరుగుతాయి. అయితే సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ వారం మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. మీ కెరీర్ పుంజుకుంటుంది.



మకర రాశి
ఈ వారం మకరరాశివారి ఆదాయం పెరుగుతుంది. ఈ వారంలో సాధించిన లాభాలను ఏకీకృతం చేయడం ద్వారా మరియు కొత్త వర్క్ ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఇదే మంచి సమయం.



కుంభ రాశి
ఈ వారం ఈ రాశివారికి ఆరోగ్యపరంగా మంచిరోజు. ఇల్లు, వాహనం కొనుగోలు దిశగా అడుగేస్తారు. పనిలో మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా రానున్న రోజుల్లో మంచి ఫలితాలు పొందుతారు.



మీన రాశి
ఈ వారం మీరు మీ స్వభావంలో మీరు ఊహించని మార్పులు కొన్ని వస్తాయి. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు.