మేషం నుంచి మీనం వరకూ జూలై 16 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. కొత్తగా ఏ పని ప్రారంభించినా అనుభవజ్ఞులైనవారి సలహా తీసుకోవడం ఉత్తమం. కుటుంబ కలహాలు సమసిపోతాయి. అనుకున్న పని పూర్తి అయినప్పుడు ఆనందం ఉంటుంది.



వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు ధనలాభం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిపై కొనసాగుతున్న ఆందోళన తొలగిపోతుంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవుతారు.



మిథున రాశి
అవసరానికి మించి ఖర్చు చేయకండి. పిల్లలతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈరోజంతా సరదాగా ఉంటారు. ప్రయాణంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. నిరాడంబరంగా ఉండండి. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం నేర్చుకోండి.



కర్కాటక రాశి
పెద్దల సలహాతో మీ పనులు పరిష్కారం అవుతాయి. తెలివిగా ఖర్చు చేయండి. వ్యాపారంలో నష్టాలు రావొచ్చు. పిల్లల విజయాలపై ఆనందంగా ఉంటుంది. దంపతులు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొత్త వ్యాపారాల పట్ల ఉత్సాహంగా ఉంటారు.



సింహ రాశి
ఈ రోజు ఆదివారం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీరు చేసిన కొన్ని తప్పులకు పశ్చాత్తాప పడతారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి మార్గదర్శకత్వం నుంచి ప్రయోజనం పొందుతారు. మూఢనమ్మకాలతో డబ్బు వృధా చేయకండి.



కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు ఎవరి కారణంగా అయినా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. తప్పులను ప్రోత్సహించవద్దు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక పనులకోసం ఖర్చు చేస్తారు.



తులా రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. కుటుంబంతో సఖ్యత ఉంటుంది. రిస్క్ తీసుకోవడం మానుకోండి. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది.



వృశ్చిక రాశి
ఈ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత స్నేహితులను కలుస్తారు. ధనలాభం పొందే అవకాశం ఉంది. ఈరోజు సంతోషకరమైన రోజు కానుంది. దంపతులు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అప్రమత్తంగా ఉండండి.



ధనుస్సు రాశి
ఈ రాశివారు కొత్త అవకాశాలు పొందుతారు. తెలియని అడ్డంకి కారణంగా మీ పని ప్రభావితం కావొచ్చు. రహస్య శాస్త్రాలను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తారు. సురక్షితమైన ప్రయాణం చేయండి. మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను మరచిపోవచ్చు.



మకర రాశి
ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. కుటుంబంలో కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది. సన్నిహితులను కలుస్తారు. మీ ప్రవర్తన బాగుంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం.



కుంభ రాశి
ఈ రాశివారు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తారు. తలపెట్టిన పనిలో వైఫల్యం కారణంగా నిరాశ చెందుతారు. రిస్క్ తీసుకోవడం వల్ల ఇంకా నష్టపోతారు. నీటి ప్రదేశాలకు వెళ్లవద్దు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



మీన రాశి
ఈ రోజు మీ ప్రవర్తన వల్ల ఎవరైనా మానసికంగా బాధపడతారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రులను కలుస్తారు. పార్టీల్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. తల్లిదండ్రుల సలహాలు పాటించండి.