మేషం నుంచి మీనం వరకూ జూలై 12 రాశిఫలాలు



మేషం రాశి
ఈ రోజు మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ స్నేహితుల మద్దతు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదానికి దిగుతారు. తొందరపాటుతో వ్యవహరిస్తే మీకు సమస్యలు తప్పవు.



వృషభ రాశి
ఈ రోజు మీరు లావాదేవీల విషయంలో ఓపికగా ఉండాల్సిన రోజు. ఆగిపోయిన పని పూర్తైనప్పుడు సంతోషంగా ఉంటారు. ఆర్థిక మూలాలు పెరుగుతాయి. కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనే మీ కల ఈరోజు నెరవేరుతుంది. అప్పిచ్చిన డబ్బులు తిరిగి పొందుతారు.



మిథున రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అయినప్పటికీ ఆనందంలో అనవసర వాగ్ధానాలు చేయొద్దు. భావోద్వేగ నిర్ణయాలకు చాలా మంచి సమయం కాదు. మీ సామర్థ్యంతో ఏపనినైనా ముందుగానే పూర్తిచేస్తారు. కెరీర్ గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు శుభవార్త వింటారు.



కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. తెలివితేటలతో చేసిన పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. మీరు పెద్ద లక్ష్యాన్ని వేగంగా సాధిస్తారు.



సింహ రాశి
ఈ రోజు మీరు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలకు సంబంధించి ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు విజయవంతమవుతాయి. మీరు కార్యాలయంలో మీ ప్రణాళికలలో కొన్నింటిలో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది .



కన్యా రాశి
కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు మంచి రోజు. వ్యాపార వర్గాలు వారి ప్రణాళికలపై పూర్తి దృష్టిని కొనసాగించాలి. ఆహారంపై పూర్తి శ్రద్ధ వహించాలి, లేకుంటే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మిత్రులతో సాన్నిహిత్యం ఉంటుంది. మీరు ఎవరికైనా వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చాలి.



తులా రాశి
ఈ రోజు మీకు కొన్ని చిక్కులు తెచ్చి పెడుతుంది. తొందరపడి మాట తూలకండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి . పనిలో చురుకుదనం ఉంటుంది . ఏదైనా ముఖ్యమైన పనిలో మీరు ఓపికగా ఉండాలి. ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.



వృశ్చిక రాశి
ఈ రాశివారు చదువు, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. కార్యాలయంలో మీ సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోగలుగుతారు. మీరు పెద్ద లక్ష్యంపై దృష్టి పెట్టాలి. పరస్పర సహకార స్ఫూర్తి మీలో ఉంటుంది. కుటుంబ విషయాలపై పూర్తి ఆసక్తిని కనబరుస్తారు.



ధనుస్సు రాశి
ఈ రోజు మీకు ఆనందంంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలలో కొత్త శక్తి ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం మంచిది. మీరు మీ శక్తిని సరైన పనిలో పెట్టాలి, అప్పుడే మీరు దానిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అహంకారంతో మాట్లాడకండి మీకున్న మంచి పేరు నశిస్తుంది .



మకర రాశి
ఈ రోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చేరడం ద్వారా పేరు సంపాదించుకుంటారు. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో మీ నమ్మకం అలాగే ఉంటుంది. మీరు కొంతమంది కొత్త వ్యక్తుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు.



కుంభ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనిలో వేగం చూపించవలసి ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని విలువైన వస్తువులను కూడా సేకరించవచ్చు.



మీన రాశి
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. సృజనాత్మక పనిపై పూర్తి ఆసక్తిని చూపుతారు. ముఖ్యమైన విషయాల్లో ఏదైనా గొప్ప అవగాహనను ప్రదర్శించాలి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ మాటల్లో సౌమ్యత మీకు గౌరవాన్ని తెస్తుంది.