రాహువు సంచారం - అక్టోబరు వరకూ ఈ రాశులవారికి యోగకాలం



శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహాల్లో రాహువు కూడా ఒకటి. ఏప్రిల్ నుంచి మేష రాశిలో సంచరిస్తున్న రాహువు అక్టోబరు నెలాఖరు వరకూ ఇదే రాశిలో ఉంటాడు.



అక్టోబరు 28 న మీన రాశిలోకి వెళతాడు. అంటే దాదాపు నాలుగు నెలల పాటూ ఈ నాలుగు రాశులవారికి అద్భుతంగా ఉంటుంది.



సాధారణంగా రాహువు అంటే చెడు మాత్రమే చేసే గ్రహం అనుకుంటారు. అయితే రాహువు సంచారం కొన్ని రాశులవారికి శుభఫలితాలనిస్తుంది.



కర్కాటక రాశి
మేష రాశిలో రాహువు సంచారం కర్కాటక రాశివారికి బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు. వ్యాపారులు లాభపడతారు. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఐటీ రంగానికి చెందినవారు ప్రమోషన్ పొందుతారు.



సింహ రాశి
ఈ రాశి 10వ ఇంట్లో రాహువున్నాడు. దీంతో అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సిన పరిస్తితి వస్తుంది. ఉద్యోగులకు శుభసమయం. ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొంత నియంత్రణ పాటించండి



వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు.ఈ ప్రభావంతో ఉద్యోగం లేనివారు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. గతంలో మధ్యలోనే ఆపేసిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.



కుంభ రాశి
ఈ రాశినుంచి రాహువు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సందర్భంగా వ్యాపారం విస్తరిస్తుంది. మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం. నిరుద్యోగులు ఓ ఉద్యోగంలో స్థిరపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

2023 జూలై 10 నుంచి జూలై 16 వారఫలాలు

View next story