2023 జూలై 10 నుంచి జూలై 16 వారఫలాలు



మేష రాశి
ఈ వారం మీకు కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీరు పనిచేసే రంగంలో ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. ఓర్పుగా ఉండాలి, కష్టపడి పనిచేయాలి. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించండి .ఖర్చులపై నియంత్రణ పాటించండి



వృషభ రాశి
ఈ వారం మీరు మీ కుటుంబం, మీ ఇంటి వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కొత్తగా భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆహారంపై శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది.



మిథున రాశి
ఈ వారం కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేసే అవకాశం లభిస్తుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. మీరు మాట్లాడే విధానం స్పష్టంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.



కర్కాటక రాశి
ఈ వారం మీ వ్యాపారంలో స్థిరత్వం , శ్రేయస్సుకు అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేయండి. మీ శక్తి సామర్థ్యాలను సక్రమంగా వినియోగించండి. డబ్బుకు సంబంధించిన ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి



సింహ రాశి
ఈ వారం మీరు వృత్తిలో విజయం సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఈవారం ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా ఆ వారాంతానికి కొన్ని విజయాలు సాధిస్తారు. మీ ప్రొఫెషనల్ గ్రాఫ్ నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంది.



కన్యా రాశి
ఈ వారం మీరు వ్యాపారం , కార్యాలయంలో మరింత కష్టపడాలి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి - కొత్త బాధ్యతలు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. మీ నైపుణ్యాలను ఉపయోగించండి మరియు మీ వర్క్ స్పేస్ లో కొత్త మరియు ఉత్తేజకరమైన ప్రాజెక్టులను కనుగొనండి.



తులా రాశి
ఈ వారం మీరు పునిచేసే ప్రదేశంలో పనిపై దృష్టిసారించాలి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఓపికంగా ఉండాలి. మరింత కష్టపడాలి. కొత్త ప్రణాళికను ప్రారంభించండి దానిపై క్రమం తప్పకుండా పనిచేయండి.



వృశ్చిక రాశి
ఈ వారం వ్యాపారానికి సంబంధించిన విషయాలలో స్థిరత్వం, శ్రేయస్సు పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుంటారు. మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ఎట్టకేలకు పూర్తిచేస్తారు.



ధనుస్సు రాశి
ఈ వారం మీరు ఓ కొత్త ప్రాజెక్టును లేదా కొత్త పనిని ప్రారంభించే అవకాశాలున్నాయి. భాగస్వామ్య వ్వాపారం పుంజుకుంటుంది. మీరు రాజకీయాలు లేదా సామాజిక రంగంలో చురుగ్గా ఉంటారు



మకర రాశి
ఈ వారం మీరు ఆఫీసు లేదా పని ప్రదేశంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీ లక్ష్యాల వైపు దృష్టి పెట్టండి. వ్యాపార విషయాలలో అప్రమత్తంగా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సవాళ్లను ఎదుర్కొనే మీ నైజం కొత్త మార్గాలకు దారితీస్తుంది.



కుంభ రాశి
ఈ వారం మీ నైపుణ్యం మెరుగుపడుతుంది. మీ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు, వ్యవసాయ రంగంలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేయండి.



మీన రాశి
ఈ వారం ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో చురుగ్గా ఉండాలి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సరైన ప్లానింగ్ వల్ల సమయానికి లక్ష్యాలు సాధిస్తారు. మీ కళానైపుణ్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు.


Thanks for Reading. UP NEXT

2023 జూలై 9 రాశిఫలాలు

View next story