మేష రాశి ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీ సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మిమ్మల్ని ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్య లేదా ఆందోళనకు పరిష్కారం ఈ రోజు దొరుకుతుంది.
వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రమాదం జరిగే అవకాశముంది. మీ జీవిత భాగస్వామి మీ పై చూపే ప్రేమకి మీరు అనుభూతి చెందుతారు. మిమ్మల్ని ఆవహించి ఉన్న నిరాశ మటుమాయమవుతుంది.
మిథున రాశి మిథున రాశి వారు ఈ రోజు బిజీ బిజీగా ఉంటారు. వీరు ఎవరి సహాయం తీసుకోకుండా ఒంటరిగా అన్ని పనులు తామే చేసుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి పై చూపే శ్రద్ద వలన వారు మిమ్మల్ని మరింత ప్రేమిస్తారు. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుకుతారు.
కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు అత్యంత శుభప్రదం. మీరు ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
సింహ రాశి సింహ రాశి వారు ఈ రోజు సంతోషం గా గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇది మీ మనస్సును చాలా సంతోషపరుస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాల్లో అనవసర ఖర్చులు చేయకండి.
కన్యారాశి ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ మనసులో ఉన్న అయోమయం, గందరగోళం తొలగిపోతుంది. మీ వ్యక్తిత్వాన్ని మరింత సమర్థవంతంగా, బలంగా మార్చడానికి, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనండి . ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గించండి
తులా రాశి తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. తోబుట్టువుల సహకారం మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తుంది. ఈ రోజు మీరు మీ ప్రియమైన వ్యక్తిని కలుస్తారు.కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈ రోజు ధనవృద్ధి. మీరు బద్దకాన్ని వదిలి కష్టపడవలసి ఉంటుంది. పిల్లల చదువుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు, మీ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ఏదైనా పని ప్రారంభించే ముందు మీ ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోకండి
ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాదు. ఒత్తిడి , అలసట ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి ప్రత్యేక బహుమతి ఇస్తారు. పాత స్నేహితుడ్ని కలుస్తారు. వ్యాపారరంగం లో ఉన్నవారు పని మీద బయటికి వెళ్ళ వలసి ఉంటుంది. కొంత అలసటకు గురి అవుతారు.
మకర రాశి ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీరు మీ సోదరుడు లేదా సోదరి నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ వైవాహిక జీవితం లో మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
కుంభ రాశి కుంభ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం. ప్రేమికులు విబేధాలకు దూరంగా ఉండండి. పెట్టుబడుల వ్యవహారంలో తొందరపడకండి. పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఈ రోజు సమయాన్ని వృధా చేయకండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు మంచి రోజు. మీ ఇంట్లో పరిస్థితులు నియంత్రించడానికి మీరు మీ తోబుట్టువుల సహాయం తీసుకోవచ్చు. వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు కలత చెందుతారు.