మేష రాశి ఈ రాశివారు ఈ రోజు అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఈ రోజు వ్యాపారంలో మీ భాగస్వామితో మీ మాటలను అదుపులో ఉంచుకోండి. అదృష్టాన్ని నమ్ముకుని అడుగు ముందుకు వేయొద్దు. కొంత కష్టం ఉన్నా పనిని సకాలంలో పూర్తిచేసుకుంటారు.
వృషభ రాశి వృషభ రాశివారికి ఈ రోజు పని ఒత్తిడి పెరుగుతుంది. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించకండి. మాటలో సంయమనం పాటించండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. వ్యాపార రంగంలో ఆటంకాలు ఏర్పడతాయి.
మిథున రాశి ఈ రాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మతపరమైన పనులపై ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకోకుండా ఏదో బాధ మిమ్మల్ని ఆవహిస్తుంది కానీ వెంటనే నార్మల్ అయిపోతారు.
కర్కాటక రాశి ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు ఈ రోజు లాభదాయకమైన రోజు. పనిలో విజయం కారణంగా మీరు ప్రమోషన్ పొందుతారు. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు.
సింహ రాశి ఈ రోజు ఈ రాశివారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కన్యా రాశి ఒకరి మాటలు మిమ్మల్ని చాలా బాధిస్తాయి. ఆరోగ్యం క్షీణించే అకాశం ఉంది జాగ్రత్త. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. ధన నష్టం ఉంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రయాణం చేయాల్సి వస్తుంది. కోపం తగ్గించుకుంటే మంచిది.
తులా రాశి ఈ రోజు ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. నిన్నటి వరకూ వెంటాడిన టెన్షన్ తగ్గుతుంది. సంతోషంగా ఉంటారు. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. శారీరక బాధలు దూరమవుతాయి. ఇంట్లో గొడవలకి చెక్ పెట్టేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి ఈ రాశివారు కుటుంబ సభ్యులతో చర్చల సమయంలో మాటల విషయంలో సంయమనం పాటించాలి. మీరు పనిలో ఆశించిన విజయాన్ని అందుకోలేరు. ఏదో గందరగోళంగా ఉంటుంది. పని భారం ఎక్కువగా ఉంటుంది కానీ ఆశించిన ఫలితాలను పొందుతారు.
ధనుస్సు రాశి ఈ రోజు ఈ రాశివారికి మంచి రోజు. ఆర్థికంగా లాభపడతారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు. కొన్ని పనుల విషయంలో ఒత్తిడికి లోనవుతారు. అనుకోని ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మీరు కొంత సందిగ్ధంలో ఉండిపోవచ్చు.
మకర రాశి ఈ రోజు మీ ప్రసంగాన్ని నియంత్రించండి. సన్నిహితులతో తీవ్రమైన చర్చ లేదా వివాదం ఉండవచ్చు. మనసులో ఆందోళన ఉంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది.
కుంభ రాశి ఈ రాశివారికి ఈ రోజు అద్భుతమైన రోజు అవుతుంది. మీరు మరింత చురుకుగా ఉంటారు. ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ గౌరవం కీర్తి పెరుగుతుంది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో కలహ సూచనలున్నాయి జాగ్రత్త.
మీన రాశి ఈ రోజు ఈ రాశివారు ముఖ్యమైన పనిలో బిజీగా ఉంటారు. వ్యాపారంలో భాగస్వాములతో అవసరమైన చర్చలు చేయగలుగుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.