2023 జూలై 3 రాశిఫలాలు



మేష రాశి
ఈ రోజు మీకు పెద్దల మద్దతు లభిస్తుంది. స్నేహితుడితో ఏర్పడిన మనస్పర్థలు దూరమవుతాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. టెన్షన్ కూడా పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.



వృషభ రాశి
ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీరు పని మీద బయటకు వెళ్ళవలసి ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం.



మిథున రాశి
ఈ రోజు మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనుభూతి చెందుతారు. కుటుంబ సంబంధాల్లో అనుబంధం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ రోజు వ్యాపార పనులకు అనుకూలంగా ఉంటుంది.



కర్కాటక రాశి
ఈ రోజు వ్యాపారానికి సంబంధించి ఎలాంటి పాలసీలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకండి. మీరు ఎవరినైతే ఎక్కువగా విశ్వసిస్తున్నారో వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు..జాగ్రత్తగా ఉండండి. సంబంధ బాంధవ్యాల్లో ఎదురైన క్లిష్ట పరిస్థితిలను దైర్యంగా ఎదుర్కోండి.



సింహ రాశి
ఈ రోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఖర్చులు పెరగడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.ఈ రోజు వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలుంటాయి.



కన్యా రాశి
గడిచిన రోజుల కన్నా ఈరోజు మీకు మంచిది. రోజంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు పాత స్నేహితుడిని కలుసుకుంటారు. మీ రంగంలో మీరు చేస్తున్న కృషిని అందరూ మెచ్చుకుంటారు, గుర్తిస్తారు. జీవిత భాగస్వామితో అనవసర వాదనలకు దూరంగా ఉండండి.



తులా రాశి
ఈ రోజు మీరు ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి. మీ ప్రణాళికలను ఇతరులతో పంచుకోకండి.దాని వలన అనవసరమైన గందరగోళం ఏర్పడుతుంది, పని ఒత్తిడి కారణంగా మనస్సు కుంగుబాటుకు లోనవుతుంది. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి మద్దతు లభిస్తుంది.



వృశ్చిక రాశి
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. పరిమితికి మించి పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. ఆర్థికంగా ఈ రోజు సంతృప్తి ఉంటుంది. సంతానం చదువు గురించి ఆందోళన చెందుతారు. ఈరోజు ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన రోజు.



ధనుస్సు రాశి
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి ప్రభావవంతమైన వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో వారికి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.



మకర రాశి
ఈ రోజు మీరు పాత వివాదాల నుంచి బయటపడతారు. కొత్త ఆలోచనలతో ఉద్యోగ రంగంలో రాణిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనిలో తీరిక లేకుండా ఉంటారు. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి.



కుంభ రాశి
ఈరోజు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మనసు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వద్దు. చాలా కాలంగా నిలిచిపోయిన పనిని సులభంగా పూర్తి చేస్తారు. అధికారులతో అనవసర వాదనలు పెట్టుకోవద్దు.



మీన రాశి
ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన రోజు. కుటుంబ వివాదాన్ని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. తల్లి నుంచి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వ్యాపార సంబంధ విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు ప్రయోజనం చేకూరుస్తాయి.