జూలై 3 నుంచి 9 వరకూ వారఫలాలు



మేష రాశి
ఈ వారంలో మీరు పని చేసే టైం, విశ్రాంతి తీసుకునే టైం రెండూ సమానంగా ఉంటాయి. మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.



వృషభ రాశి
ఈ వారం ఈ రాశివారు మీ సామర్థ్యానికి మించి పని చేయాల్సిన అవసరం వస్తుంది. తొందరగా అలసిపోతారు. విశ్రాంతికి ప్రాధాన్యతనివ్వండి. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేందుకు ఇదే సరైన సమయం. మీకు శుభ్రప్రదమైన సమయం. ఈ వారం ఆర్ధిక అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది



మిథున రాశి
ఈ రాశివారు ఈ వారం డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. అశాంతి ఎక్కువ అయ్యి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ప్రతికూల అలవాట్లు మిమ్మల్ని తప్పు దారిలో పయనించేలా చేస్తాయి. అయితే కొన్ని శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి.



కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ వారం ఒత్తిడి పెరగవచ్చు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కుటుంబంలో మీ కీర్తి పెరుగుతుంది, ఈ విషయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో మీకు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.



సింహ రాశి
యోగా, ధ్యానంలో మనసు నిమగ్నమవడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు చేకూరుతాయి. కొన్ని పథకాలలో పెట్టుబడి పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.



కన్యా రాశి
కన్యా రాశిలో జన్మించిన కొందరు వ్యక్తులు ఈ వారం ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది



తులా రాశి
ఈ రాశివారు చాలా కాలంగా పోరాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయంతో పాటూ ఖర్చులు పెరుగుతాయి. కానీ ఈ వారం శ్రద్ధతో కృషి చేస్తే విజయానికి ప్రత్యేక అవకాశం లభిస్తుంది



వృశ్చిక రాశి
చాలా కాలంగా మీరు కోరుకున్న, కోల్పోయిన విశ్వాసం ఈ వారం పునరుద్ధరించుకోవచ్చు. ఆర్థిక విషయాలు మీకు గణనీయమైన విజయాన్ని తెచ్చే అవకాశం ఉంది. మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కాలం అనువైనది



ధనుస్సు రాశి
ఈ వారంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనే అవకాశం ఉంది. అయితే మీ సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. మీకు అనుకూలమైన అవకాశాల నుంచి ప్రయోజనం పొందుతారు. డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. విద్యా సంస్థలో జాయిన్ అవటానికి పరిగణించండి, ఎందుకంటే ఇది ఆశాజనకమైన సమయం.



మకర రాశి
ఈ వారం మీకు అన్నీ అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. విహార యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి ఫలితాలుంటాయి.నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి.



కుంభ రాశి
ఈ వారం కుంభ రాశివారు వ్యాపారాన్ని విస్తరించడానికి రుణం తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీ మనస్సు గందరగోళంగా అనిపించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త ఇల్లు కొనాలని ఆలోచన కొంతకాలం వాయిదా పడుతుంది. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.



మీన రాశి
ఈ వారం ఈ రాశివారికి కుటుంబంలో మంచి సపోర్ట్ ఉంటుంది. మీ కెరీర్ అభివృద్ధి చెందుతుంది. ఈ వారం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. ఎట్టకేలకు మీరు కోరుకున్న సౌకర్యాలను పొంది ఆస్వాదిస్తారు.



Images Credit: Pixabay