మేష రాశి శుక్రుడి రాశి మార్పు మేష రాశి వారికి శుభప్రదంగా ఉంది. ఈ కాలంలో ప్రేమ సంబంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. మీరు మీ బంధం విషయంలో సీరియస్ గా ఉంటారు.
వృషభ రాశి వృషభ రాశి వారికి కూడా శుక్రుడి సంచారం శుభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి మిథున రాశి వారికి సింహ రాశిలో శుక్రుడి సంచారం అత్యంత లాభదాయకం. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.
కర్కాటకరాశి సింహ రాశిలో శుక్రుడి సంచారం కర్కాటక రాశివారి జీతంలో ప్రకాశం నింపుతుంది. మీ వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. మీ మాటతీరు మారుతుంది, అందరితోనూ కలిసేందుకు ప్రయత్నిస్తారు.
సింహ రాశి మీ రాశిలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదకరమైన, బాధ్యతారహితమైన పనులకు దూరంగా ఉండండి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
కన్యా రాశి శుక్రుడి సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది కానీ కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యం వద్దు. నిరుద్యోగలు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది.
తులా రాశి ఈ రాశివారు ఆర్థిక పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. అయితే అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతే రంగంలోకి దిగడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి శుక్రిడి సంచారం సమయంలో మీ కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త, ఖర్చులు తగ్గించడం మంచిది. అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి శుక్రుడి సంచారం సమయంలో ధనస్సు రాశివారి సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
మకర రాశి సింహ రాశిలో శుక్రుడి సంచారం మకర రాశివారి జీవితంలో సంతోషం నింపుతుంది. నిన్నటి వరకూ గందరగోళంగా ఉన్న పరిస్థితి నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం బావుంటుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
కుంభ రాశి ఈ రాశివారి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది కానీ అనవసర ప్రసంగాలు ఆపేస్తే మంచిది. మీ ప్రవర్తనపై విమర్శలొస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇంకొన్నాళ్లు ఆ ఇబ్బందులు తప్పవు.
మీన రాశి ఈ రాశివారికి శుక్రుడి సంచారం పెద్దగా కలసిరాదు. తలపెట్టిన పనుల్లో ఆంటకాలు ఏదురవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు. Images Credit: Pixabay