ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు నింపనున్న బుధుడు



ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూలై 8 నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈనెల 25 వరకూ అంటే దాదాపు మూడు వారాల పాటూ కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఈ  ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది.



మేష రాశి
కర్కాటక రాశిలో బుధుడి సంచారం వల్ల మేష రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి..ఖర్చులు తగ్గుతాయి, అప్పులు తీరుతాయి. ప్రేమ జీవితం,వైవాహిక జీవితం బావుంటుంది



వృషభ రాశి
బుధుడి సంచారం వృషభ రాశి వారికి జీవితంలో పురోగతిని కలిగిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.



కర్కాటక రాశి
మీ రాశిలోని బుధుడు సంచరిస్తున్నాడు. ఫలితంగా కర్కాటక రాశివారికి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఎప్పటినుంచో చేతికిరాదు అనుకున్న డబ్బు అనుకోకుండా అందుతుంది.



న్యా రాశి
బుధుడి సంచారం మీకు మంచి చేస్తుంది. ఉద్యోగం, వ్యాపారం పరంగా ఇదే అనుకూలమైన సమయం. తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు కూడా ఇది మంచి సమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.



తులా రాశి
బుధుడి సంచారం తులారాశివారికి జీవితంలో ఊహించని మార్పులు తీసుకొస్తుంది. అనుకున్న పనులు, అనుకోకుండా ప్రారంభించిన పనులు కూడా పూర్తవుతాయి. పనిపట్ల అంకితభావం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు పడుతుంది.



బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, సంపద, వాణిజ్యం మరియు చర్చల గ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బుధుడు జూలై 8 నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు.



ఈనెల 25 వరకూ అంటే దాదాపు మూడు వారాల పాటూ కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటే కొన్ని రాశులవారిపై అనుకూల ప్రభావం ఉంటుంది.



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

2023 జూలై 08 మీ రాశి ఫలితం

View next story