జాతకంలో రాజయోగం ఉన్నా లేకపోయినా ఈ మూడురాశుల్లో జన్మించినవారు మాత్రం రాజయోగం అనుభవిస్తారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు
సాధారణంగా రాశిచక్రం, అంశచక్రం వేసేటప్పుడు గ్రహాల స్థానాన్ని బట్టి రాజయోగం ఉందో లేదో చెబుతారు. రాజయోగం అంటే ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు తక్కువ ఉంటాయి, కొంచెం కష్టపడినా మంచి ఫలితం పొందుతారు.
జీవితంలో ప్రతీదీ సులభంగా పొందుతారు.అయితే పుట్టినప్పటి నుంచీ రాజయోగాన్ని పొందే రాశులు మూడున్నాయి.
సింహ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. చాలా తెలివైన వారు, చురుకైన వారు. వీరి వ్యక్తిత్వం పదునుగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. బాగా సంపాదిస్తారు. సకల భోగాలు అనుభవిస్తారు.
తులారాశిలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. వీరికి జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం బాగా వచ్చట. చాలా తెలివైన వారు, కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు అవుతారు. అయినప్పటికీ తక్కువ శ్రమతోనే మంచి ఫలితాలుసాధిస్తారు.
కుంభ రాశి వారు పుట్టుకతోనే రాజయోగం ఉంటుందంటారు పండితులు. వీరెప్పుడూ చాలా ప్రశాతంగా ,సంతోషంగా ఉంటారు. చదవడం, రాయడంలో చాలా నేర్పరులు. ఇంట్లో కన్నా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.
గమనిక:మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.