మేషం నుంచి మీనం వరకూ జూలై 23 రాశిఫలాలు



మేష రాశి
మేష రాశివారు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు కష్టపడితేనే ఫలితం దక్కించుకోగలరు. పాత నష్టాలు భర్తీ చేసుకునే అవకాశాలున్నాయి. ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు.



వృషభ రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. బడ్జెట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపారంలో కొంత నగతు సమస్య ఉండవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టొద్దు. పిల్లల చదువు, ప్రవర్తనపై కొంత నిఘా పెట్టడం మంచిది.



మిథున రాశి
ఈ రోజు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో మంచి సంబంధాలుంటాయి. మీ కష్టానికి క్రెడిట్ మరొకరు తీసుకునే అవకాశం ఉంది..అప్రమత్తంగా ఉండాలి.



కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆహారాన్ని ఆస్వాదిస్తారు. విదేశాల నుంచి ఆదాయ అవకాశం పొందుతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు సంతోషంగా ఉంటారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు.



సింహ రాశి
మీ సన్నిహితులతో మర్యాదగా ప్రవర్తించండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ సంబంధాలు అపరిమితంగా ఉండకూడదని గుర్తుంచుకోండి. పాత ఆస్తుల విక్రయం వల్ల లాభం ఉంటుంది. ఇంటి విషయాల్లో బయటి వ్యక్తులు జోక్యాన్ని సంహించవద్దు.



కన్యా రాశి
మీ జీవనశైలిని క్రమబద్ధంగా ఉంచండి. చాలా కాలం తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. కళ మరియు సాహిత్యం పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో మీ అద్భుతమైన పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. ఇల్లు మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం.



తులా రాశి
ఈ రాశివారికి సన్నిహితులతో టెన్షన్ ఏర్పడవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి కానీ ఓపిక పట్టండి. కుటుంబంతో గరిష్ట సమయం గడపడం సముచితంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో శ్రద్ధ వహించాలి.



.

వృశ్చిక రాశి
ఈ రాశివారు ప్రవర్తనలో సానుకూల మార్పు వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం పెద్ద లాభాలను కలిగిస్తుంది. కార్యాలయంలో ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించండి. తల్లిదండ్రుల ఆదేశాలను అనుసరించే వారు విజయం సాధిస్తారు.



ధనుస్సు రాశి
ఈ రాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశం ఉంది. కెరీర్లో ఎదురైనా ఆటంకాలు తొలగిపోతాయి.



మకర రాశి
ఈ రాశివారు ఇంటిపెద్దల సలహాలు పాటించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఒకేసారి చాలా పనులు మీదేసుకోవద్దు. ఏ పనినీ పూర్తి చేయలేక ఇబ్బందిపడతారు. శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి.



కుంభ రాశి
ఈ రాశివారికి పని ఒత్తిడి ఉంటుంది. ఇంటికి ఆకస్మికంగా అతిథి వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కొంత ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపార కార్యకలాపాలలో సమస్యలు ఉంటాయి. మీ వర్కింగ్ స్టైల్‌లో పెద్దగా మార్పులు చేయకండి.



మీన రాశి
ఈ రాశివ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచిరోజు. స్నేహితులను కలుస్తారు. పాత వివాదాలు పరిష్కరించుకునేందుకు ఈ రోజు మంచి రోజు. వైవాహిక బంధం బావుంటుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది.