మేష రాశి ఈ రాశివారు ఈ రోజు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. లావాదేవీల విషయంలో పొరపాట్లు ఉండవచ్చు. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదుర్చోవద్దు. ఇంటి పరిసరాల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృషభ రాశి ఈ రాశివారి ఆరోగ్యం మునుపటి కన్నా మెరుగుపడుతుంది.ఈ రాశి ఉద్యోగుల పనితీరుకి ప్రశంసలు అందుతాయి. మీ పనిలో నాణ్యత పెరుగుతుంది. ప్రమాదకర విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.
మిథున రాశి ఈ రోజు ఏదో పనిపై బయటకు వెళతారు. లావాదేవీలు బాగా సాగుతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. స్థిరాస్తులు పెరుగుతాయి. కొత్త పనిని ప్రారంభించడానికి రోజు మంచిది.
కర్కాటక రాశి ఈ రాశివారు వ్యాపారంలో వస్తున్న సమస్యలను దూరం చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. కండరాల ఒత్తిడి సమస్య ఉండవచ్చు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచిది.
సింహ రాశి ఈ రాశి వారు కుటుంబ సభ్యుల తప్పుడు అలవాట్ల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు.
కన్యా రాశి ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో సీనియర్ల సహాయం తీసుకోవలసి ఉంటుంది. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
తులా రాశి జీవిత భాగస్వామి ప్రవర్తన ఈ రోజు మిమ్మల్ని బాధపెడుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెడతారు. ఈ రాశి ఉద్యోగులు పనిపట్ల అంకితభావంతో ఉంటారు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
వృశ్చిక రాశి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారులు మీ పనితీరుపట్ల సంతృప్తిగా ఉంటారు. మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలో మంచి ఫలితాలు పొందుతారు.
ధనుస్సు రాశి ఈ రోజు మీ ఖర్చులు పెరగవచ్చు. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టలేరు. మనసులో ఆందోళన ఉంటుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం తగ్గుతుంది. మానసికంగా, శారీరకంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది.
మకర రాశి ఈ రాశివారు పనిచేసే రంగంలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలమైన రోజు. మీరు సామాజిక కార్యక్రమాలపై అధిక ఆసక్తిని కనబరుస్తారు. ఇంటి వాతావరణం స్నేహపూర్వకంగా ఉంటుంది.
కుంభ రాశి ఈ రాశివారి తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించకోవాలి. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇదే మంచి సమయం. ఈ రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. అనుకున్న పనిని పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతారు.
మీన రాశి ఈ రాశివారు తలపెట్టిన ముఖ్యమైన పనులకు అడ్డంకులు ఏర్పడతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు.