మేషం నుంచి మీనం వరకూ జూలై 30 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.



వృషభ రాశి
ఈ రాశివారికి ఈరోజు మనశ్శాంతి ఉంటుంది. అయితే కోపానికి దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యా కార్యాల్లో విజయం ఉంటుంది. మేధోపరమైన పనిలో గౌరవం పొందుతారు



మిథున రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ మనసు చంచలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. స్థానచలనం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.



కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశివారి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. మీకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.



సింహ రాశి
ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగ ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.



కన్యా రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది ఖర్చులు పెరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. మేధోపరమైన పని నుంచి డబ్బు పొందవచ్చు.



తులా రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఒడిదొడుకులు ఉంటాయి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహితుల నుంచి సహకారం ఉండొచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మేధోపరమైన రచనల ద్వారా గౌరవం పొందుతారు.



వృశ్చిక రాశి
ఈ రాశి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగులకు ఖర్చులు పెరుగుతాయి కానీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. మాటలో సౌమ్యత ఉంటుంది.



ధనుస్సు రాశి
ఈ రాశివారు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం మెరుగుపడుతుంది.



మకర రాశి
ఈ రాశివారు ఈరోజు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.



కుంభ రాశి
ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు తలపెట్టే పనులకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది.



మీన రాశి
ఈ రాశివారికి చదువులపై ఆసక్తి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే ఛాన్సుంది. కుటుంబంలో-కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. రోజంతా సంతోషంగా ఉంటారు