మేష రాశి ఈ రాశివారు ఆగస్టు మొదటివారం బాగానే ఉంటుంది. ప్రణాళిక ప్రకారం వెళితే అనుకున్న పనులు పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నష్టాల నుంచి కోలుకునేందుకు అడుగుముందుకు వేస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు
వృషభ రాశి జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకూ ఈ వారం రోజులు వృషభ రాశి వారికి కొన్ని సమస్యలు అధికం అవుతాయి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఈ వారం పెద్దల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది.
మిథున రాశి నూతన వారంలో మిథునరాశి వారికి మానసిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు మంచిరోజు.
కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.
సింహ రాశి ఈ వారం సింహరాశివారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహిస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. బుధుడి సంచారం వల్ల విద్యార్థులకు కష్టాలు ఎదురవుతాయి. ఎదుటివారిని అర్థం చేసుకునే సామర్థ్యం ఉండడం వల్ల మీకు సన్నిహితులు పెరుగుతారు.
కన్యా రాశి ఆగస్టు మొదటివారం కన్యారాశివారికి మంచిజరుగుతుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ వ్యూహం మంచి ఫలితాలనిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఈ రాశివారిలో సృజనాత్మక సామర్థ్యం మెరుగుపడుతుంది.
తులా రాశి ఈ రాశివారికి ఈవారం మిశ్రమ ఫలితాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్తపడండి. కొన్ని వ్యవహారాల్లో సహనంగా ఉండాలి సమయస్పూర్తితో వ్యవహించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది
వృశ్చిక రాశి ఈ వారం వృశ్చిక రాశివారు తొందరగా అలసిపోతారు. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు పెద్దల సహాయం తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
ధనుస్సు రాశి రొటీన్ లైఫ్ తో ఈ రాశివారు విసిగిపోతారు. అందుకే ఈ వారం కాస్త భిన్నంగా ఉండాలని ఆలోచిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వివాహితుల జీవితం బావుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
మకర రాశి ఈ వారం మకరరాశివారి ఆరోగ్యంలో హెచ్చుతగ్గులుంటాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు శుభవార్త పొందవచ్చు. మీరు మీ నైపుణ్యాన్ని,అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
కుంభ రాశి ఈ వారం కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు తలపెట్టిన పనులను పూర్తిచేసే పనిలో ఉండండి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మీ జీవిత భాగస్వామి నుంచి సహాయం అందుతుంది.
మీన రాశి వారికి ఈ వారం మీనరాశి వారికి ఆరోగ్యం పరంగా సానుకూలత ఉంటుంది. మీరు మీ సమస్యలను పరిష్కరించుకోగలరు. నాలుగు రకాల పనులు ఒకేసారి చేయడం కన్నా ఓ పనిపై శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితం సాధిస్తారు. Images Credit: Pixabay