జూలై 31 న్యూమరాలజీ



నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ తేదీల్లో జన్మించినవారి ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. దైవభక్తి మెండుగా ఉంటుంది. సంగీతం, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు కలిసొస్తుంది. వ్యాపారులను అదృష్టం వరిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.



నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
అనవసరమైన ఆర్థిక నష్టాలను తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది.



నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ రోజు మీరు ఒంటరిగా గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు.మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అంత అనకూలంగా ఉండదు.



నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ రోజు మీ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు మీలా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు మంచి సమయం. అనుభవజ్ఞుడైన వ్యక్తులను సంప్రదించిన తర్వాతే కొత్త పనులు ప్రారంభించండి.



నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఈరోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మనసులో ఆనందం ఉంటుంది. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో విజయం ఉంటుంది.



నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు , విద్యార్థులకు అంత అనుకూల పరిస్థితులున్నాయి. కొత్త సమస్యలు తలెత్తవచ్చు. కార్యాలయంలో ఏదైనా అదనపు బాధ్యతలు మీకు పెరుగుతాయి.



నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెట్టే రోజవుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసొస్తుంది. ప్రేమికులకు, వివాహితులకు ఈ రోజు మంచి రోజు.



నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ప్రమాదకర విషయాల్లో నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయండి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఏదో ఒక విషయంలో చీలిక రావచ్చు. మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.



నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
ఈ తేదీల్లో జన్మించిన వారికి ఈ రోజు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వివాదాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది జాగ్రత్త. మాటలను, కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ప్రవర్తనలో సౌమ్యతను కాపాడుకోవాలి.