మేషం నుంచి మీనం వరకూ ఆగష్టు 1 రాశిఫలాలు



మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిది. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వారి స్ఫూర్తిదాయకంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. చేయాల్సిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు.



వృషభ రాశి
ఈ రాశివారు ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. గత కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న విషయం నుంచి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. వనరులను అర్థవంతంగా ఉపయోగించుకుంటారు.



మిథున రాశి
ఈ రాశివారికి పనిభారం పెరుగుతుంది. కొన్ని పాత సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. మీ కోపం స్నేహితులను కలవరపాటుకి గురిచేస్తుంది. ఆహారాన్ని నియంత్రించండి. విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయించండి.



కర్కాటక రాశి
ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిరోజు. ఉద్యోగులు కార్యాలయంలో మీరు పెద్ద ప్రాజెక్టు పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ ఇమేజ్ మెరుగుపడుతుంది. మీరు తలపెట్టే పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు పొందుతారు.



సింహ రాశి
ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. బిజీ కారణంగా కొన్ని అవసరమైన పనులకు అంతరాయం కలుగుతుంది. మీ మాటతీరు, ప్రవర్తన ఆకర్షణీయంగా ఉంటుంది.



కన్యా రాశి
ఈ రాశివారు ఈ రోజు ఓర్పు , శాంతితో పని చేయాలి. అలసట వల్ల బలహీనంగా అనిపిస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల మీకున్న కొన్ని అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటి పెద్దల విషయంలో నిర్లక్ష్యం తగదు.



తులా రాశి
ఈ రోజు తులారాశి వారికి మంచి రోజు కానుంది. ఆర్థిక సమస్య తీరుతుంది. స్నేహితుడి నుంచి ఓ గుడ్ న్యూస్ వింటారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.



వృశ్చిక రాశి
ఈ రాశివారు కష్టమైన పనిని కూడా ఈ రోజు సులభంగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. తెలివైనవారు చెప్పిన సలహాలను పరిగణలోకి తీసుకోండి. సాంకేతిక రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి విజయాన్ని పొందవచ్చు



ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులు ఇచ్చే సూచనలను కార్యాలయంలో అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరులలో లోపాలు చూడొద్దు.



మకర రాశి
ఈ రాశివారికి కుటుంబ సభ్యులపై శ్రద్ధ పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలను ఈరోజు పూర్తి చేస్తారు. సోషల్ మీడియాలో అతి ఉత్సాహం తగ్గించుకుంటే మీకే మంచిది. ముఖ్యమైన ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తారు.



కుంభ రాశి
ఈ రాశివారిపై పనిఒత్తిడి ఉంటుంది కానీ ఆ ఒత్తిడిని మీరు అధిగమించి సమయానికి పని పూర్తిచేస్తారు, మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే వ్యక్తులు నేర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం.



మీన రాశి
ఈ రాశివారు ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గౌరవం మరింత పెంచుకున్నవారవుతారు. మీ ఆలోచనలను బయటకు వ్యక్తపరచండి. కిందిస్థాయి ఉద్యోగులతో విభేదాలు ఏర్పడే సూచనలున్నాయి జాగ్రత్త.