మేష రాశి ఈ రోజు మేషరాశివారు మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. స్నేహితుల సహకారంతో వ్యాపారం, ఉద్యోగంలో మంచి ప్రయోజనాలు పొందుతారు.
వృషభ రాశి ఈ రాశివారి ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో చిక్కులు తొలగిపోతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు జోరందుకుంటాయి.
మిథున రాశి ఈ రాశివారు ఈ రోజు ప్రతి పనిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సహజంగా ఉండే చిరాకును తగ్గించుకోవాలి. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లాలి అనుకున్నవారికి నిన్నటి వరకూ ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి ఈ రాశివారు ఆర్థిక సంబంధిత విషయాల్లో పదే పదే పొరపాట్లు చేస్తూనే ఉంటారు..ఇకనైనా డబ్బుల విషయంలో జాగ్రత్త వహించాలి. నిర్మాణ పనుల్లో ఉన్నవారు తొందరపడండి లేదంటే అనుకోని ఆంటకాలు ఎదురుకావొచ్చు.
సింహ రాశి ఈ రోజు ఈ రాశివారు ధనలాభం పొందుతారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. వ్యాపారం పుంజుకుంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం.
కన్యా రాశి ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండాలి. సమాజంలో గౌరవం పొందుతారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. బంధువులను ఎక్కువగా నమ్మొద్దు. మీ ఆలోచనలను జీవిత భాగస్వామితో పంచుకుంటే మంచి జరుగుతుంది.
తులా రాశి ఈ రాశివారు ఈ రోజు అనుకోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి ఈ రాశివారు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీ చాకచక్యం ప్రశంసలు అందుకుంటుంది. కార్యాలయంలో మీ పనిని నిర్లక్ష్యం చేయకండి. వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపవద్దు.
ధనుస్సు రాశి ఈ రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారులు మీ పనితీరుని ప్రశంసిస్తారు. వృత్తిపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. దానధర్మాలకు ధనం ఖర్చు చేస్తారు.
మకర రాశి ఈ రాశి నిరుద్యోగులు ఈ రోజు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. ఆరోగ్యం బావుంటుంది. శ్రమకు తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.మీ ప్రవర్తన అందరూ మెచ్చేలా ఉంటుంది.
కుంభం నిన్నటి వరకూ వెంటాడిన ఓ సమస్య నుంచి మీరు బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల విషయంలో కాస్త సున్నితంగా ఉంటారు. కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
మీన రాశి ఈ రాశివారికి ఇంట్లో వాతావరణం ఒత్తిడితో కూడుకున్నది అయి ఉంటుంది. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపడకండి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు అవసరమైన పత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.