మేష రాశి ఈ రాశివారి ఆలోచనలు ఈ రోజు క్షణక్షణానికి మారిపోతుంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగం మారాలి అనుకునేవారు అనుజ్ఞవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. స్నేహితులు మీ నుంచి సహాయం అర్థిస్తారు.
వృషభ రాశి ఈ రాశివారిని కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు.
మిథున రాశి ఈ రాశివారు వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. పెద్ద కంపెనీల నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీరు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. తెలివైన స్నేహితుల సాంగత్యం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కర్కాటక రాశి మీరు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నించండి. కార్యాలయంలో అంతగా అనుకూల పరిస్థితులు ఉండవు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇ్వవద్దు, తీసుకోవద్దు.
సింహ రాశి వేరేవారి విషయాల్లో అనవసర జోక్యం మానుకోండి. ఇంటి వాతావరణం కొంత ఇబ్బందిగా ఉంటుంది. మనసులో కొత్త ఆలోచలు వస్తాయి వాటిని సరిగ్గా అమలు చేయండి. అనవసర విషయాలపై ఆసక్తి పెరగడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు.
కన్యా రాశి ఈ రాశివారికి చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ఈరోజు ముందుకు కదులుతాయి. కొత్త శక్తితో ముందుకు సాగుతారు. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కళలకు సంబంధించిన వ్యక్తులకు గౌరవం లభిస్తుంది.
తులా రాశి ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విశ్వసనీయ వ్యక్తుల సలహాలు ఈరోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
వృశ్చిక రాశి ఈ రాశివారు ఈ రోజు కొత్తగా ఏ పనీ ప్రారంభించవద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ప్రతికూల ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మీకు నచ్చిన వంటకాలు ఆస్వాదించలేరు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన విరమించుకోవడం మంచిది.
ధనుస్సు రాశి ఈ రాశివారికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అతిగా ఆలోచించడం వల్ల మీ మనసు కొంత కలవరపాటుకి గురవుతుంది. ఊహాత్మక ఆలోచనల్లో పడిపోతారు. ఇంట్లో సంతోషానికి ఆంటంకం ఏర్పడే అవకాశం ఉంది.
మకర రాశి ఈ రోజు ఈ రాశివారికి చాలా మంచిరోజు. ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది.
కుంభ రాశి ఈ రోజు ఈ రాశి విద్యార్థులకు చాలా మంచి రోజు. బ్యాంకింగ్, రుణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త పడండి. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. ఉద్యోగులు పనిని నిర్లక్ష్యం చేయవద్దు.
మీన రాశి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ ఈ రోజు నిదానంగా పూర్తవుతాయి. ఎదురైన ఆటంకాలు ఒక్కొక్కటీ తొలగిపోతాయి. వినోద పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. సన్నిహితులతో మానసిక అనుబంధం పెరుగుతుంది.