ఆగష్టు 18న రాశిమారుతున్న అంగారకుడు - ఈ రాశులవారికి అదృష్టం
జాతకంలో కుజుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తిలో ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాడు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
ఆగష్టు 18 న సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కుజుడు. ఈ సంచారం కొన్ని రాశులకు శుభప్రదమైన ఫలితానిస్తుంది.
మేష రాశి కుజుడి సంచారం మీకు కలిసొచ్చే సమయం. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. చట్టపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం బావుంటుంది. కార్యాలయంలో కొన్ని మార్పులు ఉంటాయి. అయితే కుజుడి ప్రభావంతో మీలో దూకుడు , కోపం పెరుగుతుంది.
మిథున రాశి కుజుడి సంచారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. వ్యాపారం పుంజుకుంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అయితే కుజుడి ప్రభావం కచ్చితంగా మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది.
కర్కాటక రాశి మీలో ధైర్యం, విశ్వాసం పెరుగుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఇది శుభ సమయం. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి కన్యా రాశిలో కుజుడి సంచారం మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటూ ఆనందాన్ని అందిస్తుంది. నూతన సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు దాన్నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
మకర రాశి అంగారక సంచారం మకర రాశి వారికి ఆరోగ్య ప్రయోజనాలను అందించబోతోంది. కుటుంబంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ మాటలపై సంయమనం పాటిస్తే మంచిది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఇది మంచి సమయం.
కుజుడు ఆగష్టు 18 న కన్యారాశిలోకి ప్రవేశించి అక్టోబరు 2 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఆ తర్వాత తులారాశిలోకి మారుతాడు.