మేషం నుంచి మీనం వరకూ మొత్తం 12 రాశులు. ఇందులో మూడు రాశుల చొప్పున ఒక్కో రాశి అగ్ని, నీరు, భూమికి సంకేతం. మీ రాశి దేనికి సంకేతమో తెలుసా...
నీటి సంకేతానికి చెందిన రాశులు: 1. కర్కాటకం, 2.వృశ్చికం, 3. మీనం
అగ్ని సంకేతానికి చెందిన రాశులు: 1.మేషం, 2.సింహం, 3. ధనుస్సు
భూమి సంకేతానికి చెందిన రాశులు: 1.వృషభం, 2.కన్య, 3.మకరం
గాలి సంకేతానికి చెందిన రాశులు: 1.మిథునం, 2.తులా, 3.కుంభం
నీటి సంకేతం ఉన్న రాశులవారు చాలా ఎమోషనల్ గా ఉంటారు అల్ట్రా సెన్సిటివ్. వీళ్లు సముద్రం లాంటివారు. సముద్రంలా వీరిలో చాలా రహస్యాలుంటాయి కానీ ఏదీ అంత త్వరగా బయటపడరు. అందరిలోనూ కలిసినట్టే ఉంటారు కానీ వీరి మనసులోంచి ఏ మాటా అంత తేలిగ్గా బయటపడదు.
అగ్ని సంకేతం ఉన్న రాశులవారు డైనమిక్ గా ఉంటారు. వీరికి త్వరగా కోపం వచ్చేస్తుంది అంతే త్వరగా క్షమించేస్తారు. అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగినవారు, చాలా తెలివైనవారు అవుతారు. మాటల కన్నా చర్యలకు సిద్ధంగా ఉంటారు.
భూమి సంకేతానికి చెందిన రాశులవారిలో ఎక్కువ మంది సంప్రదాయవాదులు, వాస్తవికంగా ఉంటారు. వీరిలో భావోద్వేగాలు చాలా ఉంటాయి. భౌతిక వస్తువులకు తొందరగా ఆకర్షితులవుతారు. ఏ విషయంలో అయినా ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా, స్థిరంగా ఉంటారు.
వాయు సంకేతానికి చెందిన రాశులవారు హేతుబద్ధంగా ఉంటారు. ప్రేమ కమ్యూనికేషన్ విషయంలో వీరిని మించినవారే ఉండరు. ఆలోచనాపరులు, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. సంభాషణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంటారు. తాత్విక చర్చలు, మంచి పుస్తకాలను ఇష్టపడతారు.