సెప్టెంబరు 4 నుంచి 10 వారఫలాలు



మేషరాశి వారు ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటారు. గతవారం ఎదుర్కొన్న ఇబ్బందులు కొంతవరకూ తీరిపోతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలుంటాయి. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారులు పెట్టుబడులపై కాకుండా వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలి.



వృషభ రాశివారు ఈ వారం తమని తాము చాలా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఆలోచనాత్మకంగా చేయండి. అనవసర వాగ్ధానాలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.



మిథున రాశివారికి ఈ వారం కుటుంబంలో సామరస్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యం నిర్వహణకు ప్లాన్ చేస్తారు. ఆత్మీయులతో కలవడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులకు బాగానే ఉంటుంది



కర్కాటక రాశివారికి ఈ వారం మీకు మానసికంగా గందరగోళంగా ఉంటుంది. విశ్వసనీయ వ్యక్తి నుంచి సలహా తీసుకున్నాకే కొత్త పనిని ప్రారంభించండి. అందరినీ నమ్మవద్దు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు.



సింహ రాశి వారికి ఈ వారం ప్రేమ ప్రతిపాదన రావొచ్చు..వివాహం దిశగా వెళుతుంది. జీవితంలో ముందడుగు వేసే శుభసూచనలు కనిపిస్తాయి. ఇంట్లో, కార్యాలయంలో సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.



కన్యా రాశి వారికి ఈ వారం ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. ఈ వారం మీరు ఓ చెడువార్త వినే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.



తులారాశి వారికి శుభసమయం. ఈ వారం ప్రయాణాలు, విందులు, వినోదాలలో బిజీగా ఉంటారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. జీవితం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. వ్యాపార వర్గాలకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది.



ఈ వారం వృశ్చిక రాశివారు గందరగోళ పరిస్థితిలో ఉంటారు. ఒకే సమయంలో అవకాశాలు చుట్టుముడతాయి..నిర్ణయం తీసుకోనడం మీకు కొంచెం కష్టతరమవుతుంది. ఏకాగ్రతతో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవడం మంచిది. విశ్వసనీయ వ్యక్తుల సలహాలు పాటించడం మంచిది.



ధనస్సు రాశివారు ఈ వారం మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ప్రేమ విషయంలో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. భౌతిక సుఖాల కోసం ఖర్చు చేస్తారు.



మకర రాశి వారికి కొంత బిజీగా ఉంటుంది. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఏర్పరచుకుంటే మానసిక ఒత్తిడి ఉండదు. ఆస్తి లేదా వాహనం కొనుగోలు, అమ్మకానికి సంబంధించి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి.



కుంభ రాశివారికి ఈ వారం ఆర్థికంగా విజయవంతమవుతుంది. గతవారం ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు ఈ వారం పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధిత పనులకు కూడా వారం మంచిది.



మీనరాశివారికి ఇది ఉత్తమమైన వారం. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ధార్మిక, ఆధ్యాత్మిక ప్రగతి వైపు పయనిస్తారు. కుటుంబ సమేతంగా శుభకార్యాలకు వెళతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.