ఆగష్టు 14 నుంచి 20 వారఫలాలు



మేష రాశి
మేష రాశివారికి ఈ వారం రేసులా ఉంటుంది. ఎదురైన సమస్యలన్నింటినీ చేధించుకుంటూ ముందడుగేస్తారు. గడిచినవారంకన్నా ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికవ్యవహారాల్లో దూకుడు తగ్గించి నిర్ణయం తీసుకోవాలి.



వృషభ రాశి
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఏ పనిలోనైనా దూకుడు తగదు. ఎవ్వరికీ అనవసర వాగ్ధానాలు చేయొద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునేముందు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించాలి.



మిథున రాశి
ఈ వారం మీ కుటుంబంలో సామరస్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో కొన్ని శుభ కార్యాలు జరిపేందుకు ప్లాన్ చేస్తారు. బంధాలు చీలిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ ఆత్మీయులు కలవడంతో మనసు ఆనందంగా ఉంటుంది.



కర్కాటక రాశి
ఈ రాశివారు ఈ వారం మానసికంగా గందరగోళంగా ఉంటారు. విశ్వసనీయ వ్యక్తి నుంచి సలహాలు తీసుకుని పనిలో ముందుకుసాగండి. అందర్నీ నమ్మేయవద్దు. వ్యాపారులు రెండు పడవలపై కాలు పెట్టొద్దు..సొంత వ్యాపారాన్ని చూసుకోవడం ఉత్తమం.



సింహ రాశి
అవివాహితులకు ఈ వారం వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో-పనిచేసే ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యం నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కోపాన్ని నివారించండి.



కన్యా రాశి
కన్యారాశి వారికి హెచ్చు తగ్గులతో కూడిన వారం ఇది. ఎక్కడినుంచైనా శుభవార్త- ఇంకెక్కడి నుంచైనా చెడువార్త వినే అవకాశం ఉంది. కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ దూర ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు.



తులా రాశి
ఈ రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు, విందులతో సరదాగా గడుపుతారు. మనసు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది.వ్యాపార వర్గాలకు కలిసొచ్చే సమయం ఇది. కుటుంబ జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. ఆరోగ్యంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులున్నాయి.



వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు ఈ వారం గందరగోళ స్థితిలో ఉంటారు. జీవితం మీ ముందు చాలా ఆప్షన్లు తీసుకొస్తుంది వాటిలోంచి ఓ నిర్ణయం ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం బావుంటుంది. కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి.



ధనస్సు రాశి
ఈ వారం ఈ రాశివారు బంధువులను, స్నేహితులను కలిసే అవకాశం ఉంది. మీరు ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అందరి సలహాలు తీసుకుని ఓ నిర్ణయం తీసుకోండి.



మకర రాశి
ఈ వారం మకర రాశివారు బిజీగా ఉంటారు. ఒకేసారి చాలా పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం లేదా వృత్తి - కుటుంబ జీవితం మధ్య సమతుల్యత ఏర్పరుచుకుంటే మానసికబాధ ఉండదు. ఆస్తి లేదా వాహనం కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన వ్యవహారం ఈ వారం పూర్తిచేస్తారు.



కుంభ రాశి
కుంభ రాశివారు ఈ వారం ఆర్థికంగా విజయం సాధిస్తారు. గతవారం వెంటాడిన ఆర్థిక సమస్య ఇప్పుడు ఉండదు. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికి అందుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత పనులకు కూడా వారం మంచిది.



మీన రాశి
మీన రాశివారికి ఈ వారం ఉత్తమమైనది. చాలాకాలంగా ప్రయత్నిస్తున్న పనులు ఈ వారం పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెడతారు. కుటుంబ సమేతంగా శుభకార్యాలకు హాజరవుతారు.ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.


Thanks for Reading. UP NEXT

మేషం నుంచి మీనం వరకూ ఆగష్టు 13 రాశిఫలాలు

View next story