Brahmamudi July 28th: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్, స్వప్న యాడ్ తీయించేసిన రాజ్ - అక్కా, చెల్లెళ్ల మధ్య వార్
స్వప్న మోడల్ కావాలని బొల్డ్ యాడ్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
స్వప్న యాడ్ గురించి దుగ్గిరాల ఇంట్లో గొడవ జరుగుతుంది. ఇంట్లో అందరినీ ఎదిరించి మాట్లాడుతుంటే కనకం వచ్చి కూతురి మీద చెయ్యి ఎత్తుతుంది.
కనకం: ఆది దంపతుల ముందు నిలబడి నువ్వు చేసిన ఘనకార్యం సమర్థించుకుంటున్నావా? ఇంకొక మాట మాట్లాడిన నరికి పారేస్తాను. సీతారామయ్య దంపతుల దగ్గరకి వెళ్ళి చేతులెత్తి దణ్ణం పెట్టి క్షమించమని అంటుంది. నా పెంపకం వల్ల అది ఇలా తయారైంది. ముగ్గురు ఆడపిల్లలు పుడితే దీన్ని గారాబం చేశాను అందుకే ఇలా తయారైంది. కావ్య కూడా నా కడుపునె పుట్టింది. ఇంతకాలం మమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంది. మా స్వప్న మాటలు వింటే నాకే మండిపోయింది. మీరు మౌనంగా ఉన్నారు. మీ సంస్కారానికి నమస్కారం చేయడం తప్ప ఏమి చేయలేను. నన్ను క్షమించండి
సీతారామయ్య: ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయటకి పంపించేలా ఈ కుటుంబం ఎప్పుడు చేయదు
కృష్ణమూర్తి: రా కనకం ఈ గుడిలో నిలబడి మాట్లాడే అర్హత లేదు మనకి
శుభాష్: అదేంటి ఏదో పని మీద వచ్చి మాట్లాడకుండా వెళ్తున్నారు
కనకం: అవునండి సంప్రదాయం ప్రకారం కూతురు కడుపుతో ఉందని చీర, సారె తీసుకొచ్చాము
Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, మురారీ- అలేఖ్య వాళ్ళకి నిజం చెప్పేసిన ముకుంద
ఇంద్రాదేవి: సూడిదలు తెచ్చారా? ఇవ్వకుండానే వెళ్తున్నారే. నీ కూతురు ఒడి నువ్వే నింపాలి
లేని కడుపు కోసం ఇంత ఆర్భాటం చేయాలా అని స్వప్న తిట్టుకుంటుంది. ఇక కనకం కూతురికి చీర, సారె పెట్టి దీవిస్తారు.
కృష్ణమూర్తి: మాట ఎంత పొదుపుగా మాట్లాడితే అంత విలువ. మాట జారితే అది మనసులో నిలిచిపోతుంది. అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది నీమీద ప్రేమతో కాదు ఈ కుటుంబమమీద గౌరవంతో చెప్తున్నా అనేసి కూతురికి మంచి మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. తల్లీకొడుకులు తమ ప్లాన్ ఫెయిల్ అయినందుకు రగిలిపోతూ ఉంటారు. కనకం వచ్చి ప్లాన్ మొత్తం పాడు చేసిందని తిట్టుకుంటారు.
ఇక ఇంటికి వచ్చిన కనకం స్వప్న చేసిన పని గురించి తన అక్కతో చెప్పి బాధపడుతుంది. అప్పుని చూసి ఇక నుంచి మగరాయుడు మాదిరిగా డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదని తిడుతుంది. కానీ అప్పు మాత్రం తన వల్ల కాదని పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటానని చెప్తుంది. పద్ధతి మార్చుకోమని తిడుతుంటే కృష్ణమూర్తి అడ్డుపడతాడు. అప్పు ఎవరికోసం మారదని తేల్చి చెప్తాడు. సీతరామయ్య దంపతులు ఇంట్లో జరుగుతున్న వాటి గురించి మాట్లాడుకుంటారు. ఈకాలం ఆడపిల్లలు నమ్మింది నిజమని వెళ్లిపోతున్నారు మంచి చెప్పినా చెడుగా భావిస్తున్నారని ఇంద్రాదేవి బాధపడుతుంది. వాళ్ళ మాటలు రాజ్, కావ్య వింటూ ఉంటారు. తన అక్క చేసిన పనికి కావ్య రాజ్ కి సోరి చెప్తుంది. స్వప్న ఏదో ఘనకార్యం సాధించినట్టు తాపీగా కూర్చుని తింటూ ఉంటే కావ్య కోపంగా వెళ్తుంది.
కావ్య: ఏం చేయాలని అనుకుంటున్నావ్? దాని ద్వారా ఏం కావాలని అనుకుంటున్నావ్?
స్వప్న: నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు
Also Read: దుగ్గిరాల ఇంటి ముందు మీడియా రచ్చ- సెలెబ్రెటీ అయిపోయానని చంకలు గుద్దుకున్న స్వప్న
కావ్య: ఇవి నీతులు కాదు నిజాలు. నీ బండారం బయట పడిన రోజు రోడ్డున పడతావ్. పుట్టిల్లు రానివ్వదు, అత్తిల్లు రానివ్వదు. తప్పు చేసిన కూడా నీకు మంచి జీవితం వచ్చిందని సంతోషపడితే దాన్ని నిలబెట్టుకోవడం లేదని భయంగా ఉంది. నువ్వు కడుపుతో ఉన్నావని అందరూ అనుకుంటున్నారు. దుగ్గిరాల ఇంటి సభ్యురాలివి అయ్యావు. అందరితో బాగుండాలని ఆశిస్తున్నారు ఇకనైనా బుద్ధిగా ఉండు
స్వప్న: నువ్వు సాధించలేనిది నేను సాధించాను. నిన్ను రాజ్ భార్యగా గుర్తించారు. కానీ నన్ను ఇప్పుడు ప్రపంచం గుర్తించేసరికి జీర్ణించుకోలేకపోతున్నావ్
కావ్య; నీ కాపురాన్ని నిలబెట్టుకో. నీ భర్త, అత్త నువ్వు ఈ ఇంట్లో ఉండటమే ఇష్టం లేదని మాట్లాడుతున్నారు
స్వప్న: పోవే నాకే చెప్తున్నావ్ నీకు ఈ ఇంట్లో పని మనిషి స్థానం కూడా లేదు. కోడలిగా విలువ లేదు. నీ భర్తకి నీమీద ప్రేమ లేదు. నా కాపురం గురించి మాట్లాడటానికి వచ్చావా? నీ మొగుడు నిన్ను ఎప్పుడు గెంటేస్తాడో నీకే తెలియదు ఇక నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా?
కావ్య: నా మొగుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నా మొగుడు నా ఇష్టం. నన్ను ఏదైనా అంటాడు
స్వప్న: ఇప్పుడు నా విషయంలో ఎవరూ ఏం చేయలేరు. నాలుగు రోజుల్లో నేను మోడల్ రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉంటాను. అది గ్యారెంటీ
కావ్య: నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇక నీ ఇష్టం