Brahmamudi July 19th: 'బ్రహ్మముడి' సీరియల్: రాజ్‌కి దొరక్కుండా తెలివిగా తప్పించుకున్న కావ్య - స్వప్నకి గడ్డి పెట్టిన దుగ్గిరాల కుటుంబం
తన కంపెనీకి కావ్య డిజైన్స్ వేస్తుందని రాజ్ కి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య వేసిన డిజైన్స్ కబోర్డులో ఉంటే అవి రాజ్ చూసేస్తాడు. తన దగ్గర ఉన్న డిజైన్స్ ఇవే ఇంట్లోకి ఎలా వచ్చాయని వెంటనే శృతికి ఫోన్ చేసి డిజైనర్ పేరు ఏంటని అడుగుతాడు. శిరీష అని అబద్ధం చెప్తుంది. శృతి అబద్దం చెప్తుందని అర్థం అవుతుంది ఎలాగైనా నిజం బయట పెట్టాలని అనుకుంటాడు. కనకం వాళ్ళు భోజనం చేస్తుంటే అన్నపూర్ణ వేరే ప్లేట్ తెచ్చుకుని వాళ్ళకి దూరంగా కూర్చుంటుంది. టీబీ అని చెప్పారు కదా అది అంటువ్యాధి నా నుంచి మీకు అంటుకుంటుంది. అందుకే ఈరోజు నుంచి నాకు సంబంధించినవన్నీ దూరంగా పెట్టుకుంటాను. మీరు కూడా అలాగే ఉండండి అంటుంది. అప్పు మాత్రం వినకుండా అదంతా మూడనమ్మకమని వెళ్ళి తన పెద్దమ్మకి అన్నం తినిపిస్తుంది. తను చేసిన పనికి కనకం వాళ్ళు సంతోషపడతారు.
రాజ్ నిద్రలేచి చూసేసరికి కావ్య ఉండదు. మళ్ళీ డిజైన్స్ వేయడానికి వెళ్ళి ఉంటుంది శిరీష ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకుని గదిలో నుంచి బయటకి వచ్చి కావ్య కోసం వెతుకుతూ ఉంటాడు. రాజ్ మెల్లగా కావ్య దగ్గరకి వచ్చి అరిచి భయపెడతాడు.
రాజ్: ఇవాళ ఒక నిజాన్ని బట్టబయలు చేయబోతున్నా, నీ నిజస్వరూపాన్ని నీకే చూపించబోతున్నానని తన చేతిలో ఉన్న పేపర్స్ లాగేసి చూస్తాడు. కానీ అందులో ఏమి ఉండవు. ఏంటి ఇది
Also Read: ఇంటికి తిరిగొచ్చిన ఆదిత్య, వేదకి ఖుషి సపోర్ట్ - అభితో మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్న నీలాంబరి
కావ్య: వైట్ పేపర్ ఏమి రాయకపోతే తెల్లగా ఉంటుంది
రాజ్: ఏయ్ నువ్వు నన్ను మోసం చేయలేవు నేను కింగ్ ని మోనార్క్ ని. నేను నిద్రపోగానే ఇక్కడికి ఏమిటేమిటో గీస్తున్నావ్ కదా
కావ్య: ఏమిటేమిటో కాదు నేను కూడా డిజైన్స్ గీయబోతున్నా. మీరు ఎవరో డిజైనర్ ని పొగుడుతుంటే నాకు జలస్ పుడుతుంది. మేము మాత్రం తక్కువ కళాకారులం కదా.. అందుకే కూర్చున్నా
రాజ్: సరే గీయి నేను చూస్తాను. నువ్వు గీసే వరకు నేను చూసే వరకు ఇక్కడే ఉంటాను
మంచి డిజైన్ వేస్తే దొరికిపోతానని అనుకుని ఏదో పిచ్చి డిజైన్ వేసి చూపిస్తుంది. నువ్వు నాకన్నా దేశముదురువి మంచి డిజైన్ వేస్తే దొరికిపోతావని వంకర డిజైన్ వేస్తావా అని మనసులో అనుకుంటాడు. కాసేపు తనని తిట్టేసి లోపలికి వెళ్లిపోగానే కావ్య తన పని మొదలుపెడుతుంది. ఇక తెల్లారిన తర్వాత స్వప్న యోగా చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత స్కిప్పింగ్ చేస్తుంటే రాహుల్, రుద్రాణి చూస్తారు. కావ్య చూసి తను స్కిప్పింగ్ చేయడం ఇంట్లో వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుందని వెంటనే తనని ఆపాలని అనుకుంటుంది. బయటకి వెళ్తుండగా తన కంటే ముందే సీతారామయ్య, ఇంద్రాదేవి చూసి స్వప్న అని గట్టిగా పిలిచేసరికి అందరూ బయటకి వస్తారు.
ఇంద్రాదేవి: ఏంటి ఇది ఏం చేస్తున్నావ్
స్వప్న: ఏంటి అమ్మమ్మ అలా పిలిచారు మీరు కూడా స్కిప్పింగ్ ఆడతారా?
కావ్య: అక్క ఏం మాట్లాడుతున్నావ్ పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది
ఇంద్రాదేవి: మూడో నెల కడుపుతో ఉండి స్కిప్పింగ్ చేయకూడదు.. ఆ మాత్రం కూడా తెలియదా నీకు
శుభాష్: ఇంత చదువుకున్నావ్ ఆ మాత్రం కూడా తెలియదా ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటావ్
ప్రకాశం: అవును అన్నయ్య అసలు కడుపు లేనట్టే ప్రవర్తిస్తుంది
రుద్రాణి: ఇప్పుడు అర్థం అయ్యిందా నా బాధ ఎప్పుడు ఏం చేస్తుందో తనకే తెలియదు ఇక నేను ఎలా తెలుసుకుని ఆపుతాను
కావ్య: నువ్వు ఏమన్నా చేయాలనుకుంటే అడిగి చేయవచ్చు కదా
స్వప్న: సోరి ఇక నుంచి మీ అందరినీ అడిగే చేస్తాను
Also Read: లాస్య ప్లాన్ తుస్స్, రాజ్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్- తులసిని ఇంప్రెస్ చేసే పనిలో నందు
రుద్రాణి: తప్పు చేసిన ప్రతిసారీ వదిలేస్తే అది నాకే చుట్టుకుంటుంది. వాళ్ళ పుట్టింటి వాళ్ళని పిలిపించాలి. రేపు ఈ స్వప్న ఏం చేసి కడుపు పోగొట్టుకున్నా నన్నే అంటారు. అందుకే వాళ్ళని పిలిచి వాళ్ళతోనే స్వప్నకి బుద్ధి చెప్పించాలి. రేపు ఏదైనా అయితే మాకేం సంబంధం లేదని చెప్పించాలి
శుభాష్: సరిపోతుందా అగ్రిమెంట్ రాయించమంటావా?
రుద్రాణి: నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావ్ ఏంటి అన్నయ్య
రాజ్: నాన్న చెప్పిన దాంట్లో తప్పేముంది. కన్నవాళ్ళని పిలిచి ఏం చెప్తావ్ మీ కూతురు తప్పు చేస్తుంది కడుపు పోతుంది బాధపడతారని చెప్తావా? అలా ఎవరైనా చెప్తారా?
రుద్రాణి: అలా అని స్వప్న తప్పు నెత్తిన వేసుకోమంటావా?
రాజ్: నెత్తిన వేసుకోవడం కాదు బాధ్యత తీసుకోవాలి. అది ఈ ఇంట్లో అందరి బాధ్యత. ముఖ్యంగా మీకు, రాహుల్ కి ఎక్కువ రెస్పాన్స్ బులిటీ ఉంటుంది.