Gruhalakshmi Serial July 18th Episode: 'గృహలక్ష్మి' సీరియల్: లాస్య ప్లాన్ తుస్స్, రాజ్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్- తులసిని ఇంప్రెస్ చేసే పనిలో నందు
రాజ్యలక్ష్మిని ఎదిరించి దివ్య భర్తని కొంగుని కట్టేసుకునే పనిలో ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Gruhalakshmi Serial July 18th Episode: 'గృహలక్ష్మి' సీరియల్: లాస్య ప్లాన్ తుస్స్, రాజ్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్- తులసిని ఇంప్రెస్ చేసే పనిలో నందు Gruhalakshmi Serial July 18th Episode 1000 Written Update Today Episode Gruhalakshmi Serial July 18th Episode: 'గృహలక్ష్మి' సీరియల్: లాస్య ప్లాన్ తుస్స్, రాజ్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్- తులసిని ఇంప్రెస్ చేసే పనిలో నందు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/18/71e5523201e188c1e98da31dc6a46bf11689658911031521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దివ్య తులసికి ఫోన్ చేస్తుంది. నీ కూతురి మొదటి రాత్రి జరపడం కూడ పట్టించుకోవడం లేదని దివ్య దెప్పిపొడుస్తుంది. ‘నా తంటాలు నేను పడి ఏర్పాటు చేసుకున్నా ఈరోజు నా ఫస్ట్ నైట్. నాదగ్గరకి వచ్చి పుట్టింటి బాధ్యతలు నెరవేర్చమని’ అడుగుతుంది. మాతో పని లేకుండా నా కూతురే కాపురాన్ని సరిదిద్దుకుంటుందని తులసి మెచ్చుకుంటుంది. ఇదేం దరిద్రమో ఏమో కూతురు అలా మాట్లాడితే సంతోషపడటం. ఇక లాస్య ఫస్ట్ నైట్ కోసం బెడ్ మొత్తం పూలతో అలంకరిస్తుంటే రాజ్యలక్ష్మి చూసి దివ్య ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుని కోపంగా వస్తుంది. బెడ్ మీద డెకరేట్ చేసిన పూలన్నీ చిందరవందర చేస్తుంది.
రాజ్యలక్ష్మి: అసలు ఏం చేస్తున్నావ్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి? అందంగా డెకరేట్ చేస్తున్నావ్. ఇక్కడ నాకు రగిలిపోతుంది. నీ వల్ల కాదంటే చెప్పు నేను వేరే ఆరెంజ్ మెంట్స్ చేసుకుంటాను.
లాస్య: ఇందాక మీ మావయ్య చెప్పినప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు నా మీద అరుస్తావ్ ఏంటి? ఆల్రెడీ నేను ఫస్ట్ నైట్ ఆపడానికి ఏర్పాట్లు చేశాను
Also Read: భవానీదేవిలా ఇరగదీసిన కృష్ణ, ఫ్లాట్ అయిపోయిన మురారీ- పెళ్లికి రెడీ అయిన గీతిక, గోపి
రాజ్యలక్ష్మి: అవునా నాకు చెప్పవు ఏంటి. ఇక లాస్య వేసిన ప్లాన్ చెప్తుంది. అదంతా మ్యూట్ లో వినపడకుండా చేస్తారు. ఇక ఇప్పుడు దివ్య తిక్క కుదురుతుంది. ఇక ఫస్ట్ నైట్ అనే మాట దాని నోటి నుంచే రాదు. జరగని శోభనానికి ఏర్పాట్లు ఎందుకు అయితే వెళ్ళి హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుందాం
లాస్య: జరగదని నీకు నాకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా. మనం అలా ఉంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది
నందు వాళ్ళు కేఫ్ క్లోజ్ చేసి బయల్దేరబోతుంటే ఒక కపుల్ వస్తుంది. రెస్టారెంట్ కి తీసుకెళ్లమని గొడవ ఈరోజుకి కాస్త లేట్ గా క్లోజ్ చేయమని బతిమలాడతాడు. దీంతో నందు వాళ్ళు కూర్చోమని చెప్పి ఆర్డర్ అడుగుతాడు. హెల్త్ కి బాగుండేవి తీసుకురమ్మని చెప్తాడు. ఆడవాళ్ళు మొగుడు స్లిమ్ గా ఉండాలని అనుకోవడంలో తప్పేముందని కేఫ్ కి వచ్చిన ఆవిడ అనేసరికి తులసి తల అడ్డంగా ఊపుతుంది. అది చూసి అయితే తులసికి కూడా మొగుడు సన్నగా ఉండాలని కోరికేమో అనుకుంటాడు.
ఇక ఫస్ట్ నైట్ కోసం మురిసిపోతూ దివ్య తన అందాన్ని తానే పొగుడుకుంటుంది. ఇక మొగుడు వచ్చి దివ్యని కాసేపు ఉబ్బించేలా మాట్లాడి కౌగలించుకుంటాడు. ఫస్ట్ నైట్ కోసం విక్రమ్ ఆరాటపడటం లాస్య చూసి రాజ్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. తొలిరాత్రి జరగకముందే వాడికి నేను కనిపించడం లేదు ఇక అది జరిగితే అసలు పట్టించుకోడని రగిలిపోతుంది. ఇక లాస్య ఏర్పాటు చేసిన డ్రైవర్ కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. కేఫ్ కి దగ్గరే ఉన్నానని చెప్తాడు. వాళ్ళని చంపడం కాదు కేవలం దెబ్బలు తగిలేలా మాత్రమే చేయమని పురమాయిస్తుంది.
Also Read: రిషి, మహేంద్ర మీద అనుమానపడిన ఏంజెల్- కొడుకుని హగ్ చేసుకుని ఏమోషనలైన తండ్రి
ఇక తులసి, నందు కేఫ్ నుంచి నడుచుకుంటూ బయటకి వస్తారు. ఇక్కడ ఇంట్లో తల్లి కోసం దివ్య ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రియ వచ్చి ఏంటి రెడీ అవవని అడుగుతుంది. మా అమ్మ వచ్చి రెడీ చేయాలని చెప్తుంది. ప్రసన్న వచ్చి ఇంకా రెడీ అవలేదా అంటే అమ్మ వస్తేనే రెడీ అవుతానని అంటుంది. దీంతో ప్రసన్న ఆవేశంగా రాజ్యలక్ష్మి దగ్గరకి వచ్చి దివ్య రెడీ అవలేదని చెప్తుంది. అప్పుడే లాస్య ఏర్పాటు చేసిన డ్రైవర్ కారులోనే తులసి, నందు ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి రాజ్యలక్ష్మి వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)