(Source: ECI/ABP News/ABP Majha)
Guppedanta Manasu July 18th: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషి, మహేంద్ర మీద అనుమానపడిన ఏంజెల్- కొడుకుని హగ్ చేసుకుని ఏమోషనలైన తండ్రి
Guppedantha Manasu July 18th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత ఇన్నేళ్లకు జగతి రిషిని కలుసుకుంది.
కొనఊపిరితో ఉన్న రిషికి ట్రీట్మెంట్ చేయించింది తనేనని ఏంజెల్ చెప్పడంతో జగతి, వసుధార షాక్ అవుతారు. కొన్ని సంవత్సరాల క్రితం రిషిని ఎవరో కత్తితో పొడిచారు, హాస్పిటల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిషిని నేను విశ్వం వెళ్ళి కాపాడుకున్నామని చెప్తుంది.
జగతి: అమ్మా ఏంజెల్ చాలా థాంక్స్.
అప్పుడు వసు గతంలో ఎన్ఓసీ మీద సంతకం పెట్టిన విషయం గుర్తు చేసుకుని వెళ్ళి ఏంజెల్ ని కౌగలించుకుంటుంది. వాళ్ళు చేసిన పని ఏంజెల్ కి ఏమి అర్థం కాక బిక్కమొహం వేస్తుంది.
ఏంజెల్: ఏంటి రిషి గురించి చెప్తుంటే మీరిద్దరూ ఎమోషనల్ అవుతున్నారు. అసలు నాకేం అర్థం కావడం లేదు
జగతి: నువ్వు చేసింది చిన్న సాయం కాదు ఒక ప్రాణం కాపాడావు. తల్లి జన్మనిస్తే నువ్వు పునర్జన్మ నిచ్చావు
Also Read: భార్యను ప్రశంసలతో ముంచెత్తిన రాజ్- స్వప్న దొంగకడుపు తెలిసిపోతుందా?
మహేంద్ర మాటల గురించి రిషి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రిషి గదిలోకి మహేంద్ర వచ్చి మాట్లాడతాడు.
మహేంద్ర: నాన్న రిషి అందరి ముందు నటించలేకపోతున్నా. నిన్ను పరాయివాడిలా చూడాలంటే ప్రాణం పోతుంది. ఏ కన్నతల్లిదండ్రులయిన అలా చేయగలుగుతారా?
రిషి: ఏ కన్నతల్లి అయినా కన్నబిడ్డ మీద అభియోగం మోపుతుందా? అప్పుడు అది జరిగింది ఇప్పుడు అది కూడా జరగాలి
మహేంద్ర: కానీ చిన్న రిక్వెస్ట్ ఈరోజు నేను నీతోనే ఉంటాను
రిషి: జీవితంలో మనం ఒక్క క్షణం కూడా దూరం కాకూడదు అనుకున్నా కానీ ఈరోజు మీరు ఒక్కరోజు నాతో ఉంటానని ప్రాధేయపడుతున్నారు దానికి కారణం ఆ గురుశిష్యులే కదా డాడ్ అనబోయి ఆగిపోతాడు
మహేంద్ర: ఏంటి నాన్న డాడ్ అనడానికి కూడా సంకోచిస్తున్నావా?
రిషి: నేను సంకోచించడం లేదు నా మనసులో మీ స్థానం ఎప్పుడూ అలాగే ఉంటుంది
మహేంద్ర: ఈ ఒక్క పూట నీతో ఉంటాను కాదనకు ప్లీజ్ అనేసరికి రిషి సరే అంటాడు. దీంతో మహేంద్ర కొడుకుని కౌగలించుకుంటాడు. వాళ్ళని ఏంజెల్ చూస్తుంది. రిషి ఇంత ఎమోషనల్ అవుతున్నాడు ఏంటి ఈ సార్ కి రిషికి మధ్య ఏమైనా బంధం ఉందా? అని అనుమానపడుతుంది. ప్లీజ్ డాడ్ ఎక్కువగా ఎమోషన్ అవొద్దు అందరికీ మనగురించి తెలియడం ఇష్టం లేదని రిషి అంటాడు. నీమీద ఉన్న మచ్చను చెరిపేసి తిరిగి మన ఇంటికి తీసుకెళ్తానని మహేంద్ర మనసులో అనుకుంటాడు. ఏంజెల్ విశ్వనాథం దగ్గరకి వస్తుంది.
ఏంజెల్: గెస్ట్ లు వచ్చిన దగ్గర నుంచి రిషిలో మార్పు వచ్చింది
విశ్వం: తెలిసిన వాళ్ళు అని చెప్తున్నాడు కదా అందుకే అలా ఎగ్జైట్ అవుతున్నాడు ఏమో
ఏంజెల్: వీళ్ళు తన ఆత్మీయులు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత దగ్గర బంధువులని చూసిన ఫీలింగ్, ఎమోషన్ రిషి కళ్లలో కనిపిస్తుంది(అప్పుడే వసు వాళ్ళ గదికి వస్తూ మాటలు వింటుంది)
విశ్వం: అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావ్. బంధువులు అయితే అదే మాట చెప్తారు కదా ఆత్మీయులని ఎందుకు చెప్తాడు
ఏంజెల్: అయితే ఆయన తన భార్య గదిలో ఉండకుండా రిషి గదిలోకి ఎందుకు వెళ్ళాడు. రిషి ఆయన్ని డాడ్ అని పిలవడం నేను విన్నాను. కానీ పిలవలేదని రిషి అంటున్నాడు. అసలు వాళ్ళ మధ్య ఉన్న ఆత్మీయత ఏంటో అర్థం కావడం లేదు
వసు: రిషి, మహేంద్ర సర్ మీద అనుమానం రాకుండా చూడాలని మనసులో అనుకుని ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది. ఇన్నేళ్ల తర్వాత రిషి సర్ ని కలిశారు కదా అందుకే గదిలో ఉన్నారు ఏమో. నువ్వు ఇంత చిన్న విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఏంజెల్.
ఏంజెల్: అవును రిషి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా తనతో ఉండాలని అనుకుంటారు
Also Read: గెలిచానని విర్రవీగుతున్న మాళవిక- మాలిని ప్రయత్నం విఫలం, వేద క్షమాపణ చెప్తుందా?
విశ్వం కూడ వసుధారకి సపోర్ట్ గా మాట్లాడటంతో వాళ్ళ మాటలు ఏంజెల్ నమ్ముతుంది. ఇక వసు, ఏంజెల్ రిషి గురించి మాట్లాడుకుంటారు. రిషి గురించి ఖచ్చితంగా గౌతమ్ కి తెలిసి ఉంటుందని ఏంజెల్ చెప్పేసరికి వసు షాక్ అవుతుంది. గౌతమ్ కి రిషి గురించి అన్నీ తెలుసు కానీ తను ఇప్పుడు కాంటాక్ట్ లో లేడని చెప్పేసరికి ఊపిరి పీల్చుకుంటుంది. మేం ముగ్గురం చాలా మంచి ఫ్రెండ్స్. రిషి కాలేజ్ లో ఎవరితో మాట్లాడేవాడు కాదు. గౌతమ్ తో మాత్రం బాగా మాట్లాడతాడు. అడిగితే సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాడు. కానీ రిషిని చూస్తే బాధగా ఉంది. అసలు తను ఎందుకు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడో తెలుసుకోవాలి. మహేంద్ర సర్ వాళ్ళు ఆత్మీయులు అంటున్నారు కదా వాళ్ళని అడిగి రిషి గతం గురించి అడిగి తెలుసుకోవాలని చెప్తుంది.
వసు: నువ్వు అంటుంది నిజమే కానీ రిషి సర్ ని ఇక్కడే పెట్టుకుని తన గురించి చాటుగా ఎంక్వైరీ చేశావని తెలిస్తే ఆయన బాధపడతారు ఏమో ఒక్కసారి ఆలోచించు. తన గురించి ఎంక్వైరీ చేయడం కరెక్ట్ కాదేమో
ఏంజెల్: అవును నిజమే బాధపడతాడు ఏమో అడగనులే. సరే నీ గురించి చెప్పు నీ పాస్ట్ ఏంటి?
వసు: ఏదో జీవితం సాగిపోతుంది అంతే ప్లాన్స్ ఏమీ లేవు
ఏంజెల్: పెళ్లి చేసుకోవాలని లేదా
వసు: అందరి అమ్మాయిలాగే పెళ్లి చేసుకోవాలని ఉంది
ఏంజెల్: ఎవరినైనా ప్రేమించావా? నాకైతే అలాంటివి ఏమి లేవు కానీ వాటి గురించి ఇంట్రెస్ట్ గా ఉంటుందని అనేసరికి రిషి వస్తాడు. మంచి టాపిక్ నడుస్తుంది నువ్వు రా అంటుంది. తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. గౌతమ్ నీకు కాంటాక్ట్ లో ఉన్నాడా? తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. వాడి నెంబర్ ఉంటే ఇస్తావా? అంటే రిషి వసు వైపు చూస్తాడు. అదేంటి నేను గౌతమ్ గురించి అడుగుతుంటే వసు వైపు చూస్తున్నావ్. వసుధార నీకు గౌతమ్ తెలుసా? మౌనంగా ఉంటుంది. రిషి తనకి తెలియదని చెప్పేసి వెళ్ళిపోతాడు.
విశ్వనాథం మహేంద్ర చెప్పిన ప్రపోజల్ గురించి రిషితో చెప్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పనులు మీరు, వసుధార టేకప్ చేయాలని రిషితో విశ్వనాథం చెప్పేసరికి షాక్ అవుతాడు.