By: ABP Desam | Updated at : 18 Jul 2023 08:13 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
కళ్యాణ్ గ్రౌండ్ కి వచ్చి అప్పుకి ఫోన్ చేస్తాడు. తనకి రావడం కుదరదని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఏదో సమస్యలో ఉన్నట్టు ఉంది ఎలా తెలుసుకోవడమని కళ్యాణ్ ఆలోచిస్తాడు. శృతి డబ్బులు వేస్తే అమ్మ వాళ్ళకి పంపించాలని అనుకుంటూ ఉండగా ఫోన్ చేసి అకౌంటెంట్ లీవ్ లో ఉన్నాడు రెండు రోజుల్లో డబ్బులు క్రెడిట్ చేస్తానని చెప్తుంది. అమ్మ వాళ్ళకి సాయం చేయాలని అనుకుంటే ఇలా అయ్యిందేంటని కావ్య బాధపడుతుంది. అప్పు డబ్బుల కోసం ట్రై చేస్తుంది. తను పని చేస్తున్న దగ్గరకి వెళ్ళి పది వేలు కావాలని అడుగుతుంది. ఈసారి లీవ్ పెట్టకుండా డబుల్ డ్యూటీ చేస్తానని అప్పు చెప్పినా కూడా షాపు అతను ఇవ్వలేనని చెప్పడం మొత్తం కళ్యాణ్ వింటాడు. కళ్యాణ్ ని డబ్బులు అడగమని అప్పు ఫ్రెండ్ సలహా ఇస్తాడు. కానీ అప్పు మాత్రం అడగనని అంటుంది. కళ్యాణ్ వచ్చి సాయం చేస్తానని చెప్పినా కూడా అప్పు వినకుండా వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి నీకు తెలియకుండా నీ కష్టం తీర్చాలని అనుకుంటాడు.
Also Read: గెలిచానని విర్రవీగుతున్న మాళవిక- మాలిని ప్రయత్నం విఫలం, వేద క్షమాపణ చెప్తుందా?
రాజ్ శృతి పంపించిన డిజైన్స్ చూసి తండ్రికి చెప్తాడు. ఒక కొత్త డిజైనర్ భలే వేస్తుంది, మనకి కావాల్సినట్టుగానే వేస్తుందని మెచ్చుకుంటాడు. ఎవరు ఆ డిజైనర్ అంటే తనకి ఏవో ఇబ్బందులు ఉన్నాయట ఫ్రీలాన్సర్ గా చేస్తుందని చెప్తాడు. అన్నపూర్ణ ఆరోగ్య పరిస్థితి చూసి కనకం విలవిల్లాడిపోతుంది. కృష్ణమూర్తి ఇచ్చిన బొమ్మలు అమ్ముడు పోవడం లేదని కిట్టు తిరిగి తీసుకొస్తాడు. కావ్య వేసిన అందం, కళ వీటిలో లేవని కష్టమర్స్ చెప్తున్నారని అంటాడు. పాత బొమ్మలకు ఇచ్చిన డబ్బు వాడుకున్నామని వాటిని తర్వాత తిరిగి ఇస్తానని కృష్ణమూర్తి చెప్తాడు. స్వప్న అన్నం పూర్తిగా తినకుండా వెళ్లిపోబోతుంటే కావ్య అదేంటి తినకుండా వెళ్లిపోతున్నావని అడుగుతుంది. ఇంత హెవీ ఫుడ్ తింటే తన గ్లామర్ పాడైపోతుందని అంటుంది. అప్పుడే రాహుల్ సగం ఉడకబెట్టిన కూరగాయలు తీసుకొచ్చి స్వప్నకి ఇస్తాడు.
రుద్రాణి కల్పించుకుని నడమంత్రపు సిరితో ఎగిరిపడుతుందని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. కావ్య తన కుటుంబాన్ని అంటే ఒప్పుకొనని అంటుంది. అందరూ కలిసి స్వప్నని అంటుంటే శుభాష్ అడ్డుకుంటాడు. తనకి ఏది కావాలో తన భర్త చూసుకుంటాడని చెప్తాడు. కావ్య వండే ఫుడ్ బాగుంటుంది అది కడుపులో బిడ్డకి కూడా మంచిదని కసిరి ఇంద్రాదేవి స్వప్నని అన్నం తినడానికి కూర్చోబెడుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బ్యాగ్ సర్దుకుని అన్నపూర్ణ వెళ్లబోతుంటే కనకం వాళ్ళు ఎదురుపడతారు. ఇప్పటికే చాలా చేశారు మీరు నా కోసం కష్టపడటం చూడలేకపోతున్నానని అన్నపూర్ణ బాధపడుతుంది. కనకం అక్కకి సర్ది చెప్పి ఇంట్లోకి తీసుకెళ్తుంది. రాజ్ డిజైన్స్ కావ్యకి చూపించి అవి వేసిన ఫ్రీలాన్సర్ ని తెగ మెచ్చుకుంటాడు. ఆ ఫ్రీలాన్సర్ కావ్య అని తెలియక పొగుడుతాడు. ఎవరి వేశారో ఆ డిజైన్స్ అంటే ఓ కళాపిపాసి అని అంటాడు. నువ్వు ఉన్నావ్ ఎందుకు చుక్కల ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నావని దెప్పి పొడుస్తాడు.
Also Read: ఫస్ట్ నైట్ కోసం దివ్య, విక్రమ్ పాట్లు - అత్తకి అదిరిపోయే సవాలు విసిరిన కోడలు
కాసేపు డిజైన్స్ వేసిన అమ్మాయిని పొగిడిన తర్వాత కావ్య వెళ్ళిపోతుంది. తర్వాత రాజ్ దేని కోసమో వెతుకుతూ ఉంటే కావ్య వేసిన డిజైన్స్ పేపర్స్ కనిపిస్తాయి. ల్యాప్ టాప్ లో ఉన్న డిజైన్స్, పేపర్ మీద ఉన్నవి ఒకటే కావడంతో ఆశ్చర్యపోతాడు. అసలు ఇవి ఇక్కడ ఎందుకు ఉన్నాయ్ ఇంట్లోకి ఎలా వచ్చాయని అనుమానపడతాడు. వెంటనే శృతికి ఫోన్ చేసి ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్న ఆమ్మాయి ఎవరని అడుగుతాడు.
Archana Gautam: కాంగ్రెస్ ఆఫీస్ ముందు దాడి, నడి రోడ్డుపై అత్యాచారం అంటూ బిగ్ బాస్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?
Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
/body>