By: ABP Desam | Updated at : 26 Aug 2023 10:02 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
తన తండ్రికి సాయం చేసేందుకు కావ్య మళ్ళీ పుట్టింటికి వెళ్తుంది. అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా ఎందుకు వచ్చావని అడుగుతారు. తను రాకపోతే అప్పు తీరే మార్గం ఉండదని ఇల్లు పోగొట్టుకోవాల్సి వస్తుందని అందుకే వచ్చినట్టు నచ్చజెప్తుంది. ఇక కళ్యాణ్ అనామికని వెతికే పనిలో పడతాడు. కష్టపడి తన నెంబర్ కనుక్కుని కాల్ చేసి మాట్లాడతాడు. తను చెప్పిన అడ్రస్ కి వస్తే తనని కలవొచ్చని చెప్తుంది. దీంతో కళ్యాణ్ అప్పుతో కలిసి అనామికని కలిసేందుకు ఆత్రంగా బయల్దేరతాడు. దారి మధ్యలో బైక్ చెడిపోవడంతో అప్పుడే అనామిక తలకి టోపీ పెట్టుకుని ఫేస్ కవర్ చేసుకుంటూ వస్తుంది. కళ్యాణ్ తనని లిఫ్ట్ అడిగి అనామిక చెప్పిన అడ్రస్ కి వెళతాడు. అపర్ణతో ఇంద్రాదేవి మాట్లాడకుండా ఉంటుంది. దీంతో తను కూడా కావ్యకి ఇదే శిక్ష వేస్తున్నానని ఇంట్లో ఎవరు తనతో మాట్లాడటానికి వీల్లేదని హుకుం జారీ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Also Read: అపర్ణ అహంకారం, కళావతిని వెలివేసిన కుటుంబం- కావ్య బ్యాగ్ పట్టుకుని రాజ్ ఎంట్రీ
రుద్రాణి కావ్యని అవమానించేలా మాట్లాడుతుంది. ‘ప్రస్తుతం నీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జీవితాంతం మీ అత్త కింద బానిసలాగా బతకడం. రెండు నీ పుట్టింటికి వెళ్ళి మట్టి పిసుక్కుంటూ తొక్కుకుంటూ మట్టి మనిషిలా బతకడం. ఇందులో నీకు ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఉంటుంది’ అని కావ్యని హేళన చేసి మాట్లాడుతుంది. మరి దీనికి కావ్య ఏం సమాధానం చెప్పింది? ఇంట్లో వాళ్ళు తనతో మాట్లాడారా లేదా తెలియాలంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య పని పూర్తి చేసుకుని ఆటో కోసం రోడ్డు మీద నిలబడుతుంది. అప్పుడే అటుగా వచ్చిన ముగ్గురు రౌడీలు తన గురించి నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటారు. సరిగ్గా అదే టైమ్ కి రాజ్ కారు అటు వెళ్తూ కళావతిని చూసి కొద్ది దూరంలో ఆగుతాడు. వాళ్ళ మాటలు అన్నీ వింటూ ఉంటాడు. ఇంట్లో నేను ఒక్క మాట అన్నా పడకుండా నోరు వేసుకుని అరుస్తుంది. ఇప్పుడు వాళ్ళు నీచంగా మాట్లాడుతుంటే దద్దిలాగా మౌనంగా ఉంది ఏంటని అనుకుంటాడు. ఇక కావ్య రౌడీలు మరింత రెచ్చగొట్టేలా మాట్లాడితే అప్పుడు బయటకి వస్తాడేమో భర్త ప్రేమ చూపిస్తాడేమోనని ఆశపడుతుంది. ఎంతకీ కావ్య మౌనంగా ఉండటంతో రౌడీలు తన అందాన్ని పొగుడుతూ ఉంటారు. రాజ్ కోపంగా వచ్చి వాళ్ళని పట్టుకుని నాలుగు పీకుతాడు. నువ్వు తనకి ఏమవుతావు బ్రదర్ అవుతావా? అంటే లాగిపెట్టి ఒకటి పీకుతాడు.
Also Read: స్టైల్ మార్చి తల్లికి షాకిచ్చిన విక్రమ్- మాజీ భార్యకు ప్రపోజ్ చేయడానికి రెడీ అయిన నందు
తన మెడలో తాళి చూస్తే అర్థం కావడం లేదా? తనకి పెళ్లి అయ్యిందని, నా మొహం చూస్తే అర్థం కావడం లేదా ఆ తాళి కట్టిన ఫ్రస్టేషన్ అని మరొక రెండు ఇస్తాడు. బాబోయ్ ఇది భార్యాభర్తల గొడవ అనుకుంటారు. మళ్ళీ నేను తనకి తాళి కట్టానని చెప్పాను కానీ తను నా భార్య అని చెప్పానా అని మళ్ళీ పీకుతాడు. దీంతో రౌడీలు పారిపోతారు. కావ్య కారులో ఎక్కిన తర్వాత ఎందుకు అంత కోపం వచ్చింది, భర్తగా ప్రేమతో వచ్చి కొట్టారా? అని అడుగుతుంది. ఆ మాటకి రాజ్ బిత్తరపోతాడు. మనసులో ప్రేమ పెట్టుకుని పైకి మాత్రం లేనట్టు నటిస్తున్నారు కదా త్వరలోనే దాన్ని బయటకి తీస్తానని కావ్య అనుకుంటుంది. రుద్రాణి అపర్ణని కావ్య గురించి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అప్పుడే రాజ్, కావ్య కలిసి కారులో ఇంటికి వస్తారు. కావ్య కావాలని తన బ్యాగ్ కారులో వదిలిపెట్టి పట్టించుకోకుండా వస్తుంది. రాజ్ దాన్ని తీసుకుని ఇంట్లోకి వస్తాడు. అది చూసి అపర్ణ కోపంగా కొడుకు వైపు చూస్తుంది. రాజ్ శాంతమ్మని పిలిచి బ్యాగ్ ఎవరూ మోయరని తిట్టేసి తనకి ఇస్తాడు.
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
బెదరగొట్టిన ‘యానిమల్’, రామ్ ‘స్కంద’.. ‘చంద్రముఖి-2’ ఎలా ఉన్నాయ్? ఇవీ ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలు
Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ గౌతమ్ మెడపై గాయాలు - తేజను తిట్టిపోస్తున్న ప్రేక్షకులు
Bigg Boss Season 7 Latest Promo: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
/body>