అన్వేషించండి

Gruhalakshmi August 25th - 'గృహలక్ష్మి' సీరియల్: స్టైల్ మార్చి తల్లికి షాకిచ్చిన విక్రమ్- మాజీ భార్యకు ప్రపోజ్ చేయడానికి రెడీ అయిన నందు

దివ్య అత్తారింట్లో అడుగుపెట్టి అందరినీ ఆట ఆడిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కన్నకొడుకుని కష్టపెడుతుంటే గిలగిలా కొట్టుకుంటున్నావా అని దివ్య అత్తని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. 101 రోజులు దీక్ష ముగిసే సరికి ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది. అప్పుడు నువ్వు ఎవరికీ కాకుండా పొతావ్ రోజులు లెక్కపెట్టుకో అత్తయ్య అని కోడలుపిల్ల వార్నింగ్ ఇస్తుంది. ఇక లాస్య తులసి ఇంటికి వచ్చి డ్రామా మొదలుపెడుతుంది. లక్కీ ఎక్కడ ఉన్నావ్ నీమీద దిగులు పెట్టుకుని వచ్చానని నాటకం ఆడుతుంది. వాడు రాగానే ప్రేమ ఉన్నట్టు తెగ నటించేస్తుంది. లాస్య ఇదంతా కావాలనే చేస్తుందని అనసూయ అంటుంది.

లాస్య: వింటున్నావా ఏమంటున్నారో? ఏవో కారణాలతో నన్ను ఇంటి నుంచి గెంటేశారు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు

లక్కీ: చూడటానికి వచ్చావ్ చూసేశావ్ కదా ఇక వెళ్లిపో

లాస్య: నీకోసం పాయసం చేసి తీసుకొచ్చాను నా చేత్తో తినిపిస్తాను

Also Read: నారీ నారీ మధ్యలో నలిగిపోతున్న ఇగో మాస్టర్- క్యూట్ గా పోట్లాడుకున్న టామ్ అండ్ జెర్రీ

నందు: వాడు హాస్టల్ లో ఉన్నప్పుడు వెళ్లమన్నా వెళ్ళేదానివి కాదు ఇప్పుడు ప్రేమ పొంగుకొస్తుందా?

లాస్య: అప్పుడు ఇప్పుడు ఒకేలా ఎందుకు ఉంటాను. పాయసం ఇంటికి తీసుకెళ్ళి తినిపిస్తాను రారా

లక్కీ: అవసరం లేదు అనేసి గిన్నె తీసుకుని మొత్తం గుటగుటా తాగేసి ఇక బై చెప్పేసి వెళ్ళిపోతాడు

తులసి: నీ కొడుకు నిన్ను కాదని వచ్చాడు నచ్చజెప్పి తీసుకెళ్లమని ఎప్పుడో చెప్పాను. కానీ నువ్వే వినలేదు

లాస్య: నా కొడుకుని నాకు దూరం చేస్తున్నారు అనేసి ఏడుస్తున్నట్టు నటించి వెళ్ళిపోతుంది

విక్రమ్ ఆలోచిస్తూ ఉంటే దివ్య వచ్చి ఏంటని అడుగుతుంది. సంజయ్ దీక్ష చేస్తుంటే చాలా బాధగా ఉందని ఫీలవుతాడు. రక్తం పంచుకుని పుడితేనే కొడుకా నేను కాదా? మా బంధాన్ని ఎవరో విడదీస్తున్నట్టు అనిపిస్తుందని బాధపడతాడు. దివ్య అత్తయ్య ఆయుష్హు కోసం ఇలా చేయక తప్పదని కవర్ చేస్తుంది. విక్రమ్ తలనొప్పి అని బాధపడుతుంటే దివ్య బామ్ రాస్తానని అంటుంది. మొగుడ్ని బుట్టలో పడేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తుంది. నడుము చూపిస్తూ లొంగదీసుకోవాలని అనుకుంటుంది. లక్కీ నందుని డాడీ డాడీ అంటూ తన వెనుకే తిరుగుతూ ఉంటాడు. చెస్ ఆడుకుందాం రమ్మని బలవంతంగా కూర్చోబెడతాడు. ఇద్దరూ ఆడుకుంటుంటే తులసి వచ్చి ఓ చూపు చూస్తుంది. వాడే బలవంతంగా కూర్చోబెట్టాడని చెప్తాడు.

రాను రాను తులసికి తనకి మధ్య దూరం పెరిగిపోతుందని, ఏమైనా చెప్దామని అంటే లక్కీ దూరుతున్నాడని నందు మనసులో తిట్టుకుంటాడు. ఇక కొడుకు అవస్థ చూసి పరంధామయ్య వాళ్ళు సెటైర్లు వేస్తారు.

పరంధామయ్య: తులసితో ఇంట్లో మాట్లాడటం కాదు. ఏదో ఒక వంక చెప్పి బయటకి తీసుకెళ్లు

Also Read: అమ్మాకొడుకుని ఏకిపారేసిన శుభాష్- అత్తింట్లో తిరిగి అడుగుపెట్టిన కావ్య

అనసూయ: గుడికి వెళ్దామని చెప్పు తప్పకుండా కాదనకుండా వస్తుంది

నందు ఫేస్ అదోలా పెట్టేసి సరేనని గొర్రె తలాడించినట్టు తల ఆడిస్తాడు. విక్రమ్ స్నానం చేసి వచ్చేసరికి సూట్ బెడ్ మీద పెడుతుంది. తనే పెట్టానని దివ్య చెప్తుంది. ఇంకాసేపటిలో హాస్పిటల్ కి వెళ్తున్నావ్ కదా అది వేసుకుని రెడీ అవమని చెప్తుంది. కానీ విక్రమ్ మాత్రం అది వేసుకొనని చెప్పి ఎప్పటిలాగా షర్ట్ తీస్తాడు.

రేపటి ఎపిసోడ్లో..

విక్రమ్ దివ్య ఇచ్చిన సూట్ వేసుకుని కిందకి దిగుతాడు. తనని చూసి రాజ్యలక్ష్మి సహా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. హాస్పిటల్ కి వెళ్తున్నానని తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. విక్రమ్ కాలు జారి పడబోతుంటే దివ్య పట్టుకుంటుంది. ఆ తర్వాత భర్త చెయ్యి పట్టుకుని సంతోషంగా నడుచుకుంటూ వెళ్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
Embed widget