News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi August 12th: దుగ్గిరాల ఇంట్లో మొదలైన రణరంగం- రాజ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించాడని తెలుసుకున్న కావ్య

కావ్య పుట్టింటికి సాయం చేస్తుండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

కృష్ణమూర్తి ఇంటికి వచ్చి అపర్ణ గొడవకు దిగుతుంది.

అపర్ణ: ఇలాంటివి జరుగుతాయనే పెళ్లి తర్వాత మీతో సంబంధం ఉండకూడదని కండిషన్ పెట్టాను. కానీ నా మాటకి విలువ ఇవ్వకుండా మీ కూతురితో పాటు నా కొడుకుని మీకు దగ్గర చేసుకోవడానికి చూశారు. తన తప్పుని సరి చేసుకుంటానని చెప్పి మళ్ళీ వెళ్ళి మా పరువు తీసింది. దుగ్గిరాల ఇంటి పరువు తీయకుండా మీ కూతుర్ని మీరే అడ్డుకోండి. లేదంటే మీ కూతుర్ని శాశ్వతంగా నా కొడుకుతో బంధం తెంచుకుని మీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటివి జరిగినా మా పరువు తీయాలని చూస్తే నేను అసలు సహించను. బ్లాంక్ చెక్ ఇచ్చి నచ్చినంత రాసుకోమని అంటుంది. కావ్య డబ్బు సమస్య అని మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కకూడదు అని చెక్ కృష్ణమూర్తి చేతిలో పెడుతుంది.

కనకం: ఆగండి వదిన.. మాకు పూటకి గతిలేకపోవచ్చు కానీ పక్క వాళ్ళ సొమ్ముకి ఆశపడము. మీరంతా ఒప్పుకున్నారని కావ్య చెప్పిందని రానిచ్చాము. ఇకపై కావ్య మీ పరువు తీసే ఏ పని చేయదు. తను ఈ ఇంటి కష్టంలో భాగం అవదు

Also Read: తులసికి గిఫ్ట్ ఇచ్చి కాకాపడుతున్న నందు- దివ్య దెబ్బకి అల్లాడిపోతున్న రాజ్యలక్ష్మి, లాస్య

 కృష్ణమూర్తి కూలబడిపోతాడు. అత్తారింట్లో ఒప్పించిందని అనుకున్నా లేదంటే నేను ఒప్పుకునే వాడిని కాదని కృష్ణమూర్తి బాధగా చెప్తాడు. రాజ్ ఎమోషనల్ గా ఏం చెప్పినా నమ్మేస్తాడు. ప్రెస్ మీట్ పెట్టి కావ్య మన పరువు పోగొట్టిందని చెప్పాను. నా మాటలకి రెచ్చిపోయి కావ్య కాంట్రాక్ట్ పోగొట్టేలా చేశాడని రాహుల్ తల్లికి చెప్పుకుని సంతోషపడతాడు. కరెక్ట్ టైమ్ లో మంచి పని చేశావాని మెచ్చుకుంటుంది. ఇప్పుడు అత్త, మొగుడు చేసిన పని వల్ల కావ్య గిలగిలా కొట్టుకుంటుంది. దీన్ని అడ్డం పెట్టుకుని కావ్యని ఇంట్లో నుంచి గెంటేయాలని ఫిక్స్ అవుతారు. కావ్య పని చేయడం కోసం పుట్టింటికి వస్తుంది. కృష్ణమూర్తి డల్ గా కూర్చుని ఉంటాడు.

కృష్ణమూర్తి: నువ్వు ఈ పని ఆపేసి మీ ఇంటికి వెళ్లిపో.. రేపటి నుంచి మా దగ్గర పని చేయడానికి రావొద్దు

కావ్య: ఎందుకు? నేను ఇక్కడికి రావడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది

కృష్ణమూర్తి:  నాకు కాదు నీ కాపురానికి నష్టం కలుగుతుంది. మీ అత్తగారింటికి పరువు నష్టం జరుగుతుంది

కావ్య: దీనికి సంబంధించి నేను ప్రెస్ మీట్ పెట్టి నిజం చెప్పాను. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు

కృష్ణమూర్తి: ఏది ఏమైనా నువ్వు ఇక్కడికి రావొద్దు

కావ్య: నేను చెప్పింది అర్థం చేసుకున్నారు ఇంకేం ఇబ్బంది లేదు

కనకం: నువ్వు మీడియా తో మాట్లాడిన తర్వాత మీ అత్త మాదగ్గరకి వచ్చింది. నువ్వు ఇక్కడ పని చేయడం వల్ల దుగ్గిరాల ఇంటి పరువు దెబ్బతింటుందని అన్నది. మాకు ఎంత కావాలంటే అంత రాసుకోమని ఖాళీ చెక్ కూడా ఇచ్చింది

కావ్య: ఇక చాలమ్మ ఆవిడ ఏం మాట్లాడి ఉంటారో నాకు అర్థం అయ్యింది. వాళ్ళు నన్ను అనాలసిన మాటలు అన్నీ అన్నారు. దానికి నేను మీడియాతో సమాధానం చెప్పాను. అది అంతటితో ఆగుతుందని అనుకున్నా కానీ ఇది రాజుకుంటుందని అనుకోలేదు. ఈ కాంట్రాక్ట్ చేస్తేనే మన అప్పు తీరి ఇల్లు నిలబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మధ్యలో ఎలా వదిలేసి వెళ్తాను

కృష్ణమూర్తి: మా చావు మేం చస్తాం

అప్పుడే కాంట్రాక్ట్ ఇచ్చిన శ్రీనివాసరావు ఇంటికి వస్తాడు. పని ఆపమని చెప్పేసరికి కావ్య షాక్ అవుతుంది. ఏమైంది ఎందుకు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తున్నారని నిలదీస్తుంది.

శ్రీనివాసరావు: ఏం చేయమంటావ్ పెద్ద వాళ్ళతో వ్యవహారం అయిపోయింది

కావ్య: ఎవరు ఆ పెద్దవాళ్ళు

శ్రీనివాసరావు: మీ ఆయన రాజ్.. మీ ఆయనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోమని బెదిరించారు. అందుకే క్యాన్సిల్ చేసుకుంటున్నాను

కావ్య ఆవేశంగా ఇంటికి బయల్దేరుతుంది. అప్పు, కళ్యాణ్ కలిసి అనామిక ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే అనామిక ఫోన్ చేసి నెంబర్ కనుక్కున్నావా అని అడుగుతుంది. కాసేపటిలో తెలుసుకుంటానని అంటాడు. రాజ్ ఇంట్లో పంచాయతీ మొదలవుతుంది. కావ్య ఇంటికి వస్తుంది.

Also Read: కృష్ణ వెళ్ళడానికి ఒప్పుకున్న భవానీ- గత ప్రేమని మర్చిపోమని ముకుందకి సలహా ఇచ్చిన తింగరిపిల్ల

అపర్ణ: నిన్న తప్పు జరిగిందని నిలదీస్తే ఇదేనా సరి చేసుకోవడం అంటే

కావ్య: ప్రెస్ మీట్ పెట్టడంలో తప్పు ఏముంది

శుభాష్: ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మాకు ఒక మాట చెప్పాలి కదమ్మా

అపర్ణ: అలాంటివి ఆలోచిస్తే పుట్టింటికి వెళ్ళి మన పరువు ఎందుకు తీస్తుంది

కావ్య: అందుకేనా మా ఇంటికి వెళ్ళి అమ్మానాన్నని బెదిరించారు. నన్ను అక్కడికి వెళ్లొద్దని అవమానించారు

అపర్ణ: నువ్వు మా గురించి పబ్లిక్ గా మాట్లాడి మా పరువు తీశావ్ మరి నాకెంత కోపం రావాలి

రుద్రాణి: నీ కోడలు పద్ధతి మార్చుకుంటుందో లేదో అది చెప్పమను చాలు

కావ్య: తప్పు అనిపిస్తే అసలు నేను ఆ పని చేయను

అపర్ణ: ఇంత మందికి ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పినా కూడా ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూశారా అత్తయ్య

Published at : 12 Aug 2023 08:46 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial August 12th Episode

ఇవి కూడా చూడండి

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?

Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?

Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!

Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!

Krishna Mukunda Murari October 4th: శకుంతలని అవమానించిన ముకుంద- కృష్ణ ఉగ్రరూపం!

Krishna Mukunda Murari October 4th: శకుంతలని అవమానించిన ముకుంద-  కృష్ణ ఉగ్రరూపం!

Nindu Noorella Saavasam October 4th: మేజర్ ను చూసి షాకైన మిస్సమ్మ - మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న అరుంధతి!

Nindu Noorella Saavasam October 4th: మేజర్ ను చూసి షాకైన మిస్సమ్మ - మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న అరుంధతి!

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!