Nindu Noorella Savasam September 23rd: ఇంట్లోకి తిరిగి అడుగుపెట్టిన అరుంధతి ఆత్మ - సైకోలా మారిన మనోహరి!
అరుంధతి తిరిగి తన ఇంటి లోపలికి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Nindu Noorella Savasam September 23rd: భాగమతి అరుంధతిని లోపలికి రమ్మని అంటుంది. తన దగ్గర ఉన్న సూట్ కేసులను గడప దగ్గర పెడుతుంది.
చిత్రగుప్త: ఇంటి బయట రక్షణ ఉన్నంతవరకు నువ్వు లోపలికి వెళ్ళలేవు. తను లోపలికి వెళ్లి నీ ఫోటో చూస్తే నువ్వు ఆత్మవని తెలిసిపోతుంది. నిన్ను భగవంతుడే కాపాడాలి. అని అంటాడు. ఇంతలో ఒక సూట్ కేస్ ని గడప లోపల పెట్టబోతుండగా భాగమతి చేయి తగిలి ఆ రక్షణ మూట గడప నుంచి కిందకి పడిపోతుంది.
అరుంధతి: అసలు నువ్వు నాకు ఏమవుతావు? ఎవరూ చేయలేంది నువ్వు నాకోసం చేశావు అని మనసులో అనుకొని గడప దగ్గరికి వస్తుంది అరుంధతి.
భాగమతి: అయ్యో ఇంట్లో అడుగుపెట్టక ముందే ఒక వస్తువుని కింద పడేసాను ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటూ ఉండగా ఇంతలో నీలా అక్కడికి వస్తుంది.
నీల: అమ్మో అమ్మో ఎంత పని అయింది. అమ్మగారు ఇక్కడికి రండి చూడండి ఏమైందో అని అందరినీ పిలుస్తుంది. ఇప్పుడు మనోహరి తో పాటు అందరూ అక్కడికి వస్తారు.
మనోహరి: వచ్చి రాగానే వస్తువులన్నీ కింద పడేస్తుంది. ఇంక నీకు ఇక్కడ పని లేదు వెళ్ళిపో. అని అనగా పక్కనే ఉన్న అమర్ వాళ్ళ అమ్మ పంతులుగారు దాన్ని ముందే తీసేయమన్నారు కదా ఇప్పటికి ఎందుకు తీయలేదు. అది ముందే తీయవలసింది నువ్వేం తప్పు చేయలేదు లోపలికి రా అని అంటారు. అప్పుడు భాగి అరుంధతి తోపాటు కుడి కాలు పెట్టి లోపలికి వస్తుంది. ఇంతలో రాథోడ్ వస్తాడు. పెద్దలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
Also Read: సుమనకు ఆస్తి ఇచ్చిన విశాల్ - విషపు కత్తిని మింగిన పాము!
మహేశ్వరి: చూడు నువ్వు ఇంట్లో ఏ పని చేయాలన్నా నాకు చెప్పే చేయాలి, పిల్లలకి ఏ తిండి పెట్టిన నాకు చెప్పాలి.
భాగీ: అయినా వచ్చినప్పుడు నుంచి అడుగుదామనుకుంటున్నాను అసలు మీరు ఎవరు? ఇంటికి మీరు ఏమవుతారు?
రాథోడ్: ఈమె మా అమ్మగారి ఫ్రెండ్ పెద్దకర్మ అయిన తర్వాత వెళ్ళిపోతారు.
మహేశ్వరి: ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు కాలం చెబుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హాల్లో ఉన్న తన ఫోటోని భాగీ చూడకూడదు అని అరుంధతి ఆ దిక్కున కప్పేస్తుంది . తర్వాత రాథోడ్ భాగిని తన గదికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు భాగి ఇందాక బ్యాంకు వాళ్లు ఫోన్ చేశారు కదా అతను నిజంగా బ్యాంకు వాడేనా అని తిరిగి ఫోన్ చేస్తుంది.
భాగి: ఇందాక మీరు ఫోన్ చేశారు కదా బ్యాంకు వాళ్లు అనుకుని పెట్టేసాను. మీరు నిజంగా బ్యాంకు వాళ్లేనా?
అమర్: కాదండి నేను ఆ విషయం మీకు చెబ్దాము అనుకుంటున్నాను అని అంటాడు. మనసులో తన స్నేహితురాలు ఆరు చనిపోయిందని తెలిస్తే బాధపడుతుంది మెల్లగా విషయం చెప్పాలి అని అనుకుంటాడు.
Also Read: మాజీ భార్యని ఇంప్రెస్ చేసేందుకు నందు తిప్పలు- జాహ్నవి ఆత్మహత్యాయత్నం
భాగీ: మరి చెప్పండి ఎవరు మీరు?
అమర్: నేనెవరో చెప్తాను దానికి నేను మిమ్మల్ని కలవాలి. మీ మీద దురుద్దేశంతో కాదు మనుషులు ఉన్న చోటనే కలుద్దాము మీ ఇంటి అడ్రస్ చెప్పండి అని అనగా ముందు కోప్పడినా సరే కొంచెం సేపు ఆలోచిస్తుంది భాగీ.
భాగీ: సరే నేను లొకేషన్ షేర్ చేస్తాను అక్కడికి వచ్చి కలండి అని ఫోన్ పెట్టేస్తుంది.
తర్వాత రాథోడ్ తో నాకు చిన్న పని ఉన్నది ఒక గంటలో తిరిగి వచ్చేస్తాను అర్జెంట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. మరోవైపు అరుంధతి ఇంట్లో ఉన్న దేవుడి గది వైపు వెళుతుంది.
అరుంధతి: స్వామి నాకు ఎలాగో అన్యాయం జరిగిపోయింది కనీసం నా కుటుంబం అయినా బాగుండేలా చూడు అని చెప్పి ఇల్లంతా చూసి ఇంట్లో తన పాత జ్ఞాపకాలు అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇంతలో పిల్లలు గుర్తొచ్చి పిల్లల దగ్గరికి వెళ్తుంది. అక్కడ పిల్లలందరూ దిగులుగా కూర్చుని ఉంటారు.
అంజలి: అక్క పెద్దకర్మ అంటే ఏంటక్కా? రేపు అమ్మకి పెద్ద కర్మ అంటున్నారు అని అనగా నీకు ఎలా చెప్పను అని అంటుంది వాళ్ళ అక్క. ఆ మాటలు విన్న అరుంధతి అక్కడే కూర్చుని ఏడుస్తుంది. వెనకనే చిత్రగుప్తుడు కూడా ఈ మాటలు వింటూ బాధపడతాడు.
ఆకాష్: అక్క, అమ్మ మన చుట్టూ ఇక్కడే ఎక్కడ ఉందనిపిస్తుంది అక్క
అరుంధతి: నాన్న ఆకాష్ నేను ఇక్కడే ఉన్నాను రా నన్ను చూడరా అని ఏడుస్తుంది అరుంధతి. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

