అన్వేషించండి
Satyabhama Serial February 19th Episode Highlights: దుష్ట చతుష్టయం ధాటికి క్రిష్ విలవిల.. నిన్ను కొడుకు అనుకోవడం లేదంటూ బాంబ్ పేల్చిన భైరవి - సత్యభామ ఫిబ్రవరి 19 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Serial February 19th Episode : సంజయ్ తన కొడుకే అని భైరవికి నిజం తెలిసిపోయింది. మరోవైపు మహదేవయ్య కుట్రలు సాగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial February 19th Episode Highlights
1/9

సంజయ్ కి కోట్లు కుమ్మరిస్తుంటే చూస్తూ ఊరుకోనంటూ ఫైర్ అవుతుంది భైరవి. సంజయ్ మన కొడుకు..చిన్నాగాడే పరాయివాడు చక్రవర్తి కొడుకు అంటూ భైరవికి షాక్ ఇస్తాడు.
2/9

నీ డెలివరీ టైమ్ లో మనపై కొందరు అటాక్ చేసి మన పిల్లల్ని చంపుతానన్నారు అంటూ అప్పుడు జరిగినదంతా భైరవికి చెబుతాడు. ఇంత కాలం ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచావ్..తల్లి నుంచి బిడ్డని దూరం చేయడం తప్పు అనిపించలేదా అని బాధపడుతుంది భైరవి.
3/9

వాడిని బిడ్డా అని గుండెలకు హత్తుకుంటా అంటే..అలా చేయకు నిజం తెలిస్తే చిన్నా బయటకు వెళ్లిపోతాడు అంటాడు మహదేవయ్య. చిన్నా కూడా నా బిడ్డే నాతోనే ఉంటాడు అంటుంది. ఛీ అలా అనకు..వాడు మనకు కాపలా కుక్క. సంజయ్ తలపై కిరీటం అయితే చిన్నాగాడు కాలి కింద చెప్పు అంటాడు.
4/9

ఈ మొత్తం వినేసిన సంజయ్..ఇది ఈ ఇంటివారసుడి రక్తం. నీకు ఈ ఇంటికి సంబంధం లేదని తెలిశాక నిన్ను ఈ ఇంట్లో ఉంచితే నేను చేతకానివాడిని అవుతానంటాడు. రెడీ బ్రో అనుకుంటాడు సంజయ్
5/9

సంధ్య జీవితం ఓ రాక్షసుడి చేతిలో పెట్టానని క్రిష్ సత్యను చూసి బాధపడతాడు. ఇంతలో సత్య దగ్గరకు వచ్చిన సంధ్య.. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్లిపో నాకు కనిపిస్తుంటే చిరాగ్గా ఉంది అంటుంది. నీ కన్నా నేను బెటర్ పొజిషన్లో ఉన్నాను అందుకే నీకు నన్ను చూసి ఈర్ష్య అంటుంది
6/9

నోటికొచ్చి సంధ్య మాట్లాడుతుంటే క్రిష్ చేయొత్తుతాడు..సత్య ఆపేస్తుంది. ఇప్పుడు అడుగుతున్నా సత్యా..సంధ్య ఈ ఇంట్లో ఉండాలా వద్దా అని అడుగుతాడు. నువ్వు దేవత లాంటి అక్క ఉన్నందుకు అదృష్టవంతురాలివి అంటాడు. సంధ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది.
7/9

సంజయ్ ..క్రిష్ ని ఎలా గెంటేయాలా అని ఆలోచిస్తుంటే భైరవి వచ్చి తలనిమురుతుంది.కళ్లు తెరిచిన సంజయ్ ఏమైంది మామ్ అంటాడు. ఏంటి కొత్తగా పిలిచావ్ అని అడిగితే బిగ్ మామ్ అనబోయి అలా అన్నా అంటాడు. భైరవి చైన్ సంజయ్ మెడలో వేసి ఉంచుకో అని చెప్పి వెళ్లిపోతుంది
8/9

మొత్తం నిజం నాకు తెలిసింది.. డాడ్-నువ్వు మాట్లాడుకుంటుంటే విన్నాను అంటాడు. కన్నీళ్లు పెట్టుకున్న భైరవిని చూసి తల్లిప్రేమ అడ్డుపెట్టుకుని క్రిష్ ని ఓ ఆట ఆడిస్తాను అనుకుంటాడు. అమ్మా పాతికేళ్ల తర్వాత ఓ కోరిక కోరుతున్నా అంటూ...ఇక నుంచి క్రిష్ స్థానంలో నేను ఉండాలి వాడిని ఇంటి నుంచి తరిమేయాలి అంటాడు
9/9

సత్యభామ ఫిబ్రవరి 20 ఎపిసోడ్ లో.. అది కబ్జా ల్యాండ్ అని ఒప్పుకుంటూ పేదోళ్లకి ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పి వచ్చా అని క్రిష్ చెప్పగానే రుద్ర కాలర్ పట్టుకుంటాడు. నువ్వు మహదేవయ్య కొడుకువే అయితే ఇలా చేయవు అంటుంది భైరవి. సంజయ్ ఇదే కదా కావాల్సింది అని అనుకుంటాడు.
Published at : 19 Feb 2025 09:50 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
పర్సనల్ ఫైనాన్స్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion