Prema Entha Madhuram August 9th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అను బాబును కిడ్నాప్ చేసిన రౌడీలు, మదన్ చెంప పగలగొట్టిన అంజలి?
అను బాబును రౌడీలు కిడ్నాప్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram August 9th: కోడ్ మదన్ ద్వారా ఆ ఫిమేల్ విలన్ కు లీక్ అయిందని.. మదన్ మన వైపే ఉండి మనకే వెన్నుపోటు పొడిచాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా వారిని వదిలేది లేదు అని అనుకుంటారు ఆర్య, జిండే. మరోవైపు రౌడీ పిల్లల్ని కిడ్నాప్ చేయాలని అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. ఇక ఆర్య, జిండే భాను వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక తాము వెళ్ళిపోతున్నాము అనటంతో భోజనం చేసి వెళ్లమని అంటారు.
ఇక తమకు అర్జెంటు పని ఉందని ఆర్య అంటాడు. వెంటనే జిండే.. ఆర్య ఇద్దరు పిల్లల పేర్ల మీద పది.. పది లక్షలు డిపాజిట్ చేశాడు అని.. రేపు వచ్చి బ్యాంకు వాళ్లు డీటెయిల్స్ తీసుకుంటారు అని అనగా ఇవన్నీ ఎందుకు అని అంటారు భాను వాళ్ళు. అది తన గిఫ్ట్ అని రేపటినాడు పిల్లల చదువులకు అవసరమవుతుంది అని చెప్పి పాప చెయ్యి పట్టుకుంటాడు ఆర్య. పాపని వదలడం ఇష్టం లేకున్నా కూడా తప్పనిసరిగా వెళ్తాడు.
ఆర్య వెళ్ళగానే అను తన బుర్కా తీసి చెంప మీద కొట్టుకుంటూ బాగా ఏడుస్తుంది అను. వెంటనే ప్రీతి వాళ్ళు కంగారుపడుతూ ఎందుకలా చేస్తున్నావు అనటంతో.. ఆర్య సార్ తన పిల్లల గురించి చాలా బాధపడుతున్నాడు అని.. అన్న ప్రసన్న వేడుకలో తన పిల్లలకు కూడా ఇలా చేయాల్సిన వాడినని కానీ వాళ్ళు లేరని బాధపడుతున్నారు. ఆయన బాధ నాకు కళ్ళల్లో కనిపించింది అని చెప్పి బాధపడుతుంది.
ఇక ఆర్య వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళగా.. మంచితనం పేరుతో మదన్ చేసిన మోసాలను తలుచుకుంటాడు. అప్పుడే అక్కడికి మదన్ కోడ్ ని స్కాన్ చేసిన సీసీ ఫుటేజ్ ను తమ వర్కర్ తీసుకొని రావటంతో ఆ వీడియో చూసి షాక్ అవుతారు. అప్పుడే అంజలి దంపతులు కూడా అక్కడికి వచ్చి.. కోడ్ స్కాన్ చేసిన వాళ్ళు ఎవరో తెలిసిందా అని అడుగుతుంది. దాంతో జిండే ఆ సీసీ ఫుటేజ్ వీడియో చూపించడంతో అది చూసి అంజలి షాక్ అవుతుంది.
మదన్ తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా ఆ సమయంలో నీరజ్ ఫోన్ చేయడంతో ఆ డాక్యుమెంట్స్ అన్ని సీక్రెట్ లాకర్ లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగా వెంటనే మదన్ ఆ సీక్రెట్ లాకర్ లో ఆ కోడ్ ఫోటో దింపుకోవడం అనేది అంత ఆ వీడియోలో చూసి షాక్ అవుతుంది. ఇక తన బ్రదర్ అలా చేస్తాడని అనుకోలేదు అంటూ.. అదంతా తన నిర్లక్ష్యం వల్ల జరిగింది అని బాధపడుతుంది.
ఇక వెంటనే మదన్ కి ఫోన్ చేయటంతో ఫోన్ కలవకపోయేసరికి బాగా కోపం పెంచుకుంటారు. అదే సమయంలో జిండే మదన్ కాల్ లీస్ట్ పట్టుకొని వస్తాడు. మరోవైపు రేష్మ అనుకి పాపని ఇచ్చి తను బాబును తీసుకొని వెళ్లి ఆడిపిస్తుంది. అప్పుడే రౌడీ ఇంట్లోకి వచ్చి వాటర్ కి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఇక అక్కడ ప్రీతి లేకపోయేసరికి బాబుని కాసేపు చూసుకోమని రౌడీకి చెప్పి రేష్మ డబ్బులు తేవడానికి వెళ్తుంది.
వెంటనే రౌడీ బాబుని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. ఇక రేష్మ వచ్చేసరికి బాబు కనిపించకపోవడంతో బయటికి వెళ్లి చూసేసరికి ఆ రౌడీలు బాబుని కార్లో తీసుకెళ్తున్నట్లుగా చూసి వెంటనే ఇంట్లోకి వచ్చి గట్టిగా అరుస్తుంది. అను వాళ్లకు ఆ విషయం చెప్పటంతో వెంటనే అను కారు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఇక ప్రీతి రేష్మ తో నేను అను దగ్గరికి వెళ్తాను నువ్వు అంజలికి ఈ విషయం చెప్పి ఆర్య సర్ హెల్ప్ తీసుకోవాలి అని అంటుంది.
ఇక ఆఫీసులో మదన్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అంజలికి రేష్మ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పటంతో వెంటనే అంజలి ఆర్యకు ఆ విషయం చెబుతుంది. దాంతో బాబును వెతకడం కోసం వాళ్లంతా అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక కారులో వెళ్తున్న అంజలి నీరజ్ తో మనకే ఎందుకు ఇన్ని టెన్షన్స్ అని చెప్పుకుంటూ బాధపడుతుంది. ఇక వాళ్ళు వెళ్తుండగా దారిలో మదన్ కనిపించడంతో వెంటనే మదన్ దగ్గరికి వెళ్లి లాగి గట్టిగా చంప పగలగొడుతుంది అంజలి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial