అన్వేషించండి

Ennenno Janmala Bandham August 8th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: ఏసీపీ దుర్గను రెచ్చగొట్టిన వేద, తండ్రి జైల్లో ఉన్నాడన్న నిజం తెలుసుకున్న ఖుషి?

వేద ఏసీపీ దుర్గను తన మాటలతో రెచ్చగొట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Ennenno Janmala Bandham August 8th: వేద ఏసీపీ దుర్గ దగ్గరికి వెళ్లి బాధపడుతూ.. మాట్లాడాలి అని తొందరలో అనటంతో.. వెంటనే దుర్గ వేదపై కోప్పడుతుంది. ఎవరు నువ్వు ఇలా వచ్చి అడుగుతున్నావు ఏంటి అంటూ అరుస్తుంది. దాంతో వేద సారీ చెబుతుంది. కానీ దుర్గ మాత్రం పొగరుగా మాట్లాడుతుంది. ఇంతకు ఎందుకు వచ్చావు అని దుర్గ అనడంతో..

తన భర్త యశోదర్ ను లోపల వేశారు అని అనటంతో ఆ క్రిమినలా అని దుర్గ అంటుంది. దాంతో వేదకు కోపం రావడంతో కంట్రోల్ చేసుకుంటుంది. తన భర్త ఎటువంటి నేరం చేయలేదు అని అనటంతో వెంటనే దుర్గ.. మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో మాళవికను నీ భర్త గన్ తో చంపేస్తానని అన్నాడా లేదా అని అడుగుతుంది. దాంతో అన్నాడు అని వేద అనడంతో ఇంకేముంది మీ ఆయనే చంపాడు అని అంటుంది.

దాంతో వేద కూడా దుర్గకు అర్థమయ్యే విధంగా తన పర్సనల్ విషయాలు అడుగుతుంది. దానితో దుర్గ తన భర్త సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడని, పిల్లలు రెసిడెన్స్ లో చదువుకుంటున్నారని అనటంతో వెంటనే వేద.. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారంటూ కాస్త రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో వెంటనే దుర్గ గన్ తీసి వేదకు గురిపెడుతుంది. ఇక వేద నవ్వుతూ చంపండి మేడం అనటంతో దుర్గ సైలెంట్ గా గన్ కిందికి దింపుతుంది.

మీరు చంపలేరు అది కేవలం ఆవేశం మాత్రమే.. ఇలా ఆవశపడే వాళ్ళు ఎప్పుడు తొందరపడి చంపరు అని..  ఇది కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే ఇలా ప్రవర్తించాను అనటంతో దుర్గ కూడా కాస్త ఆలోచనలో పడినట్లు కనిపిస్తుంది. మరి నా భర్త చంపలేదు అని అంటున్న కూడా ఎందుకు అలా లోపల వేశారు అనటంతో.. నీ భర్త పై అభిమన్యు కేసు పెట్టాడు అని దుర్గ అంటుంది. దాంతో వేద షాక్ అవుతుంది.

మరోవైపు అభిమన్యు మాళవిక ఫోటో ముందు పిండ ప్రధానం పూజ చేయిస్తాడు. ఇక పూజారి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత మాళవిక ఫోటో వైపు చూసి నీతో చాలా సంవత్సరాలు గడిపాను. కానీ నీకు ఇలా అవుతుందని అనుకోలేదు అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి నీలాంబరి వాళ్ళు వచ్చి ఆ ఫోటో చూసి షాక్ అవుతారు.

అభిమన్యు వాళ్ళ అక్క బ్రతికున్న దానికి పిండ ప్రదానం చేయటం ఏంటి అనటంతో.. తను లేదు చనిపోయింది అని అంటాడు అభి. అలా కాసేపు మాళవిక గురించి వాళ్లకు చెబుతూ ఉంటాడు. ఇక ఖుషి కి తన ఫ్రెండ్ కనిపించడంతో తనతో కాసేపు మాట్లాడుతూ ఉండగా తన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చి ఖుషి తో నా కూతురు మీ ఇంటికి రాదు.. నువ్వు కూడా నా కూతురు జోలికి రావద్దు అంటూ.. మీ నాన్న నీ కన్నతల్లిని చంపి జైల్లో ఉన్నాడు అని అనటంతో ఖుషి షాక్ అవుతుంది.

ఇంటికి వెళ్ళిన తర్వాత ఖుషి వేద దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని కథలాగా చెప్పటంతో అది తమ కథ నే అని వేదకు అర్థమవుతుంది. ఇక నాకెందుకు ఈ నిజం చెప్పలేదు అని అనటంతో.. వేద కూడా ఆ నిజం చెప్పకపోవటానికి కారణాన్ని కథలాగా చెబుతుంది. మరి నాన్న ఎప్పుడు వస్తారు అని ఖుషి అడగడంతో నువ్వే చెప్పు అని వేద అంటుంది. నువ్వు ఎప్పుడు వెళ్లి తీసుకొస్తావో అప్పుడే వస్తాడు అని అంటుంది ఖుషి.

ఇక మరోవైపు జైల్లో ఉన్న యష్, ఇంట్లో ఉన్న వేద ఒకరికొకరు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. తరువాయి భాగంలో వేద యష్ కోసం భోజనం తీసుకొని వెళుతుంది. ఇక ఆయనకు గోరుముద్దలు పెడుతూ ఉంటుంది. యష్ కూడా వేదకు గోరుముద్దలు పెడతాడు.

also read it : Guppedantha Manasu August 7th: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Embed widget