Ammayi garu Serial Today October 30th: కోమలి-రాజు రహస్యం, అశోక్ షాక్! విరూపాక్షి-సూర్యప్రతాప్ మధ్య ఏం జరుగుతోంది?
Ammayi garu Serial Today Episode October 30th అశోక్‌కి అనుమానం బలపడేలా రాజు కోమలితో గుడికి వెళ్లి అశోక్ చూస్తుండగానే కోమలితో చనువుగా ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి తన కథనే బంటీకి చెప్పడంతో సూర్యప్రతాప్ కూడా బాధ పడతాడు. రాజు చెప్పిన మేటర్‌తో అశోక్ నిజంగానే కోమలి తనకు మోసం చేస్తుందేమో అని చాలా కంగారు పడతారు. కోమలితో కలిసి మాట్లాడితే కానీ క్లారిటీ రాదు అనుకుంటాడు.
రూప గదిలో కోమలి రాజు ఉంటారు. రాజు ఫోన్‌లో మాట్లాడుతూ తెల్లారే లోపు మొత్తం అయిపోతుంది మీరేం కంగారు పడకండి అని అంటాడు. కోమలి టెన్షన్‌తో అటు ఇటూ తిరిగితే రాజు మనసులో కోమలి నీ ప్రియుడితో ఎలా మాట్లాడాలా అని తెగ ఆరాట పడుతున్నట్లు ఉన్నావ్ అనుకుంటాడు. కోమలి రాజుతో నువ్వు ఇక్కడుంటే బంటీ కంగారు పడతారు వెళ్లి బంటి దగ్గర పడుకో అని అంటుంది. బంటీ ఏం అనుకోడులే అమ్మాయి గారు అని రాజు కావాలనే అంటాడు.
అశోక్ కోమలికి కాల్ చేస్తాడు. కోమలి రాజు ఉన్నాడనే భయంతో కట్ చేస్తుంది. కోమలి బయటకు వెళ్లాలి అని చూస్తే నేను వస్తాను అని రాజు అంటాడు. వాష్ రూంకి అని కోమలి అంటే వెళ్లమని వాష్‌రూంకి ఫోన్ ఎందుకు అని లాక్కుంటాడు. అశోక్ మళ్లీ కాల్ చేస్తే ఎలా అని కోమలి కంగారు పడుతుంది. కోమలికి మళ్లీ అశోక్ కాల్ చేస్తాడు. రాజు లిఫ్ట్ చేసి ఎవరు నువ్వు అని అడుగుతాడు.
కోమలి ఫోన్లో రాజు మాట్లాడుతున్నాడేంటి.. రాజు కోమలి ఒకే గదిలో ఉన్నారా అని అశోక్ పిచ్చెక్కి పోతాడు. కోమలి వచ్చి ఎవరు అని రాజుని అడిగితే కస్టమర్ కేర్ అంటాడు రాజు. అది విన్న అశోక్ కోమలి నా నెంబర కూడా డిలీట్ చేసేసిందా అని అనుకుంటాడు. రాత్రి ఇద్దరూ ఒకే గదిలో ఏం చేస్తున్నారు అని అశోక్ తెగ కంగారు పడతాడు. రాజు కోమలికి అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ పడుకోమని తెగ కంగారు పెట్టేస్తాడు. ఫోన్ కూడా ఇవ్వడు.
మరోవైపు దీపక్ పూర్తిగా తాయొత్తు వల్ల మందారం వశమైపోతాడు. గదిలో మందారం కాళ్లు నొక్కుతాడు. అది విజయాంబిక చూస్తుంది. ఏంట్రా నువ్వు ఇంతలా దిగజారిపోయావ్.. దీని కాలు నువ్వు పట్టుకోవడంఏంట్రా.. ఈ మందారం నీకు ఏదో మందు పెట్టింది అని అంటుంది. మందారం అంటే నాకు ఇష్టం మమ్మీ అని దీపక్ అంటాడు. విజయాంబిక మందారాన్ని కొట్టి నా కొడుకుని ఏం చేశావే అని అడుగుతుంది. మందారానికి ఇంకో దెబ్బ కొడితే ఊరుకోను అని దీపక్ అంటే విజయాంబిక దీపక్‌ని లాగిపెట్టి కొట్టి తీసుకెళ్లిపోతుంది. మందారం నవ్వుకొని ఇంతకాలం నాకు నరకం చూపించారు కదా ఇప్పుడు మీకు ఆ నరకం చూపిస్తా అని అనుకుంటుంది.
ఉదయం సూర్యప్రతాప్ లేచి నిద్రలో విరూపాక్షి చేతి మీద చేయి వేస్తాడు. విరూపాక్షి లేచి చూసి తెలీకుండా రాత్రంతా ఇక్కడే నిద్ర పోయానా అనుకుంటుంది. సూర్యప్రతాప్ కూడా విరూపాక్షిని చూస్తాడు. ఇక విరూపాక్షి లేచి వెళ్లిపోతుంది. విజయాంబిక కూడా నిద్ర లేచే సరికి పక్కన కొడుకు లేకపోవడంతో బయటకు వస్తుంది. అప్పుడే విరూపాక్షి సూర్యప్రతాప్ గదిలో నుంచి బయటకు రావడం చూసి షాక్ అయిపోతుంది. విరూపాక్షి నా తమ్ముడి గదిలో నుంచి వస్తుందేంటి.. ఇది కలా నిజమా అనుకుంటుంది. ఇక సూర్యప్రతాప్ కూడా బయటకు రావడం చూసి బిత్తరపోతుంది.
విరూపాక్షి ఎదురైనప్పుడు తిట్టడం లేదు అసహ్యించుకోవడం లేదు.. అది జీర్ణించుకోవచ్చు కానీ నా తమ్ముడి గదిలో విరూపాక్షి నిద్ర చేసింది.. అది నేను జీర్ణించుకోలేను.. ఏదో ఒకటి చేసి ఇద్దరినీ దూరం చేయాలి ఆస్తి దక్కించుకోవాలని అనుకుంటుంది. ఇంతలో మందారం రావడంతో దీపక్ గురించి అడుగుతుంది. దీపక్ నా గదిలో పడుకున్నాడు నా చేతి కాఫీ ఇవ్వమన్నాడని అంటుంది.
అశోక్ రాజు, కోమలి గురించి ఆలోచిస్తూ గుడి దగ్గరకు వస్తాడు. రాజు నిజం చెప్తున్నాడా లేదా.. కోమలి నన్ను దూరం పెడుతుంది అది చూస్తే రాజు చెప్పింది నిజమే అనిపిస్తుందని అనుకుంటాడు. కానీ కోమలి మోసం చేయదు అనిపిస్తుందని అనుకుంటాడు. ఇంతలో రాజు, కోమలి గుడికి వస్తారు. దూరం నుంచి అశోక్ చూస్తుంటాడు. రాజు అశోక్‌ని చూసి దాక్కొని చూస్తున్నావా ఇప్పుడు నీకు సినిమా చూపిస్తా చూడరా అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















