Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 30th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: హాట్ టాపిక్‌గా సహస్ర, విహారిల ఫస్ట్ నైట్ మేటర్! ఏడుస్తున్న లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 30th సహస్ర, విహారిలకు ఫస్ట్ నైట్ అయిందని లక్ష్మీతో పాటు ఇంట్లో అందరికీ తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర ఉదయం అందరి ముందుకి తనకి విహారికి మధ్య ఫస్ట్ నైట్ అయినట్లు బయటకు వస్తుంది. పద్మాక్షి సహస్రతో ఏంటే ఓ మెలికలు తిరిగిపోతున్నావ్ అంటే అమ్మా అంటూ సిగ్గు పడుతూ పక్కకు తీసుకెళ్తుంది.
సహస్ర తల్లితో బావని పూర్తిగా నా వాడిని చేసుకోవడానికి ఓ ప్లాన్ చేస్తున్నా అమ్మా.. రాత్రి బావ ఆ లక్ష్మీకి కళ్లు పోయావి కదా బావ మందు తాగి వచ్చాడని అంటుంది. ఆ లక్ష్మీకి కళ్లు పోతే విహారి తాగడం ఏంటే అని పద్మాక్షి కోపంగా అడుగుతుంది. ఆ లక్ష్మీ అంటే బావకి అభిమానం అమ్మా ఇప్పుడు బావ ఆ లక్ష్మీ ఊసెత్తుకుండా చేసే ప్లాన్ చేశా అని అమ్మతో చెప్తుంది సహస్ర. విహారితో ఫస్ట్ నైట్ అయినట్లు నటించానని అందర్ని నమ్మించానని చెప్తుంది. ఇక నుంచి అంతా నేను నడిపిస్తా అని పద్మాక్షి అంటుంది. మనసులో తెలిసో తెలీకో మంచి పని చేశావ్.. ఇక ఇంటికి వారసుడిని నువ్వే ఇస్తావ్ అని అందరినీ నమ్మించి నిన్ను శాశ్వతంగా కోడల్ని చేస్తా అని అనుకుంటుంది.
యమున విహారి అనుకుంటూ గదిలోకి వెళ్తుంది. బెడ్ మీద విహారి పడుకొని ఉంటాడు. ముఖం మొత్తం ముద్దల మార్కులతో ఉంటుంది. యమున చూసి ఇబ్బంది పడుతుంది. వసుధ, చారుకేశవ, పండు చూసి షాక్ అయిపోతారు. యమున విహారిని నిద్ర లేపుతుంది. విహారి లేచి ఎవరు వచ్చారు అని అమ్మని అనడంతో యమున లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. విహారి మత్తులో అమ్మా ఏమైంది ఎందుకు నన్ను కొట్టావ్ అని అడుగుతాడు. రాత్రి తప్ప తాగి ఎందుకు వచ్చావ్‌రా నీ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి నీకు ఏమైనా తెలుస్తుందా అని అడుగతుంది. కోపంతో నీరు తీసుకొచ్చి విహారి ముఖం మీద విసిరేస్తుంది.
యమున విహరిని తిడుతుంటే పద్మాక్షి వచ్చి ఇంతకు ముందు కూడా చాలా సార్లు తాగాడు కదా.. ఇప్పుడేంటి కొట్టేసి వాడు తాగుబోతులా తిడుతున్నావ్ అని అడుగుతుంది. ఎప్పుడు ఏం చేయాలో ఎంత కంట్రోల్‌లో ఉండాలో నా అల్లుడికి బాగా తెలుసు అని పద్మాక్షి అంటుంది. యమున మనసులో వీడు చేసిన పనికి నిజం ఎప్పటికీ చెప్పలేను అని అనుకుంటుంది. అందరూ వెళ్లిపోతారు.
విహారి అద్దంలో ముఖం చూసుకొని షాక్ అయిపోతాడు. ఒళ్లంతా ముద్దుల మార్కులు ఉండటం చూసి రాత్రి సహస్రని హగ్ చేసుకోవడం గుర్తు చేసుకుంటాడు. లక్ష్మీ ఏమైందని పండుని అడిగితే ఆ దారుణం నేను చెప్పలేను అని పండు మనసులో అనుకుంటాడు. లక్ష్మీ వసుధని కూడా అడుగుతుంది. నాకేం తెలీదు లక్ష్మీ అని వసుధ వెళ్లిపోతుంది.
లక్ష్మీ వెళ్తూ ఉంటే లక్ష్మీ దగ్గరకు సహస్ర వెళ్లి నువ్వు ఎందుకు బయటకు వచ్చావ్ అని అడుగుతుంది. ఊరికే వచ్చా అని లక్ష్మీ అంటుంది. ఇక సహస్ర లక్ష్మీతో లక్ష్మీ నీకు ఒక విషయం చెప్పాలి.. నిన్న రాత్రి ఒక విశేషం జరిగింది.. నాకు నా బావకి నిన్న మొదటి రాత్రి జరిగిపోయింది అని అంటుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. నాకు రాత్రి నిద్రే లేదు వెళ్లి పడుకుంటాను అని సహస్ర వెళ్లిపోతుంది.
లక్ష్మీ గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. తర్వాత లేచి అసలు నేను ఎందుకు ఏడుస్తున్నా నేను కోరుకున్నదే జరిగింది కదా.. సహస్రమ్మ, విహారి గారు కలిసి సంతోషంగా ఉండాలి అనుకున్నా కదా అదే జరిగింది అనుకుంటుంది. లక్ష్మీ దగ్గరకు యమున వెళ్లి లక్ష్మీని హగ్ చేసుకొని ఏడుస్తుంది. లక్ష్మీ కూడా ఏడుస్తుంది. లక్ష్మీ యమునతో కంగ్రాట్స్ అమ్మా ఎప్పటి నుంచి ఇంటి వారసుడి కోసం ఎదురు చూస్తున్నారు కదా త్వరలోనే మీ కోరిక తీరబోతుంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ లక్ష్మీ.. నువ్వు మాట్లాడే మాటలు నీకు అయినా అర్థమైందా అని యమున అంటుంది. లక్ష్మీ యమునతో ఇన్ని రోజులు గిరి గీసుకొని విహారి గారు నా కోసం ఉండిపోయారు.. ఇప్పటికైనా మారారు సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి.. త్వరలోనే మీకు వారసుడు రావాలని కోరుకోండి అని అంటుంది. నీలో అస్సలు స్వార్థం ఉండదా అని యమున అంటుంది. మీరు మీ కుటుంబం బాగుండాలి.. విహారిగారు, సహస్రమ్మ బాగుండాలి అని లక్ష్మీ అంటుంది. నీ లాంటి మంచి దానికి ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అయ్యో లక్ష్మీ అని యమున ఏడుస్తుంది.
విహారి తలస్నానం చేస్తూ ఆలోచిస్తూ ఉండిపోతాడు. రాత్రి ఏం జరిగింది ఆదమరిచి అలా ఎలా ఉన్నాను.. నేను ఎప్పటికీ తప్పు చేయను అని అనుకుంటాడు. విహారి దగ్గరకు చారుకేశవ వచ్చి ఏంట్రా ఇలా చేస్తున్నావ్ అందర్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావ్‌రా అని అడుగుతాడు. నువ్వేం తప్పు చేయకపోతే సహస్ర అంత హ్యాపీగా ఎందుకు ఉంటుందిరా.. ఎందుకు తాగి వచ్చావ్‌రా అని అడుగుతాడు. కలలో కూడా కనకానికి అన్యాయం చేయను అని విహారి అంటాడు. అంబికకు పార్థసారథి కాల్ చేసి 200 ఎకరాల గురించి అడుగుతాడు. త్వరగా సంతకాలు పెట్టించమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















