Ammayi garu Serial Today October 14th: అమ్మాయి గారు సీరియల్: రేణుక యాక్షన్.. రాజు రియాక్షన్.. న్యాయం కోసం హారతిని ఇంటికి తీసుకొచ్చిన మందారం!
Ammayi garu Today Episode సూర్య ప్రతాప్‌ని ఓడించడానికి అతని కుటుంబంలోని లొసుగులు వాడుకోవాలని రేణుక జీవన్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ నామినేషన్ తిరస్కరణ అవడంతో రాజు మరో నామినేషన్ పత్రాలు తీసుకొచ్చి అందరికీ షాక్ ఇస్తాడు. ఫ్లాష్ బ్యాక్‌లో రూప రాజుతో మాట్లాడి విజయాంబికే తనకు దగ్గర నామినేషన్ పత్రాలు ఉంచమని చెప్పడంతో అనుమానం వచ్చిన రాజు ఆ రోజు రాత్రి రూప దగ్గరకు వస్తాడు. విజయాంబిక మీద అనుమానం ఉందని చెప్పి నకిలీ పత్రాలు అక్కడ పెట్టి నామినేషన్ టైంకి అసలైన పత్రాలు తీసుకొని వస్తానని చెప్పి వాటిని మార్చేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాతే దీపక్, విజయాంబిక వచ్చి ఫైల్ మార్చేస్తారు.
ఇక నామినేషన్ పత్రాలు కరెక్ట్‌గా ఉన్నాయని చెప్పి సూర్య ప్రతాప్‌కి నామినేషన్ వేయమని చెప్పడంతో సూర్య ప్రతాప్ శత్రువులు అందరూ షాక్ అయిపోతారు. వెంటనే విజయాంబిక రూప ఇదంతా నువ్వు రాజు ఆడిన నాటకమా అని అంటుంది. రూపకి ఫైల్ ఇస్తే రాజు తీసుకురావడం ఇదంతా చూస్తే అనుమానం వస్తుందని అంటుంది.
దీపక్: మామయ్య ప్రాబ్లమ్‌లో ఉన్నట్లు క్రియేట్ చేసి సమయానికి రాజు వచ్చి కాపాడినట్లు నటిస్తే మామయ్య ఇద్దరినీ కలిపేస్తారని వీళ్ల ప్లాన్ అంతే కదా.
రాజు: పెద్దయ్యా ఇందులో రూప పాత్ర ఏం లేదు ఇదంతా నేనే చేశాను. చాలా రోజుల తర్వాత మీరు మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారని తెలిశాక ఏదో ఒక అటాక్ జరుగుతూనే ఉంది. ముందు మమల్ని జాతరలో చంపాలని చూశారు. తర్వాత మీ మీద అటాక్ చేశారు. ఇక రూప సీమంతంలో గన్‌తో కాల్చాలి అని చూశారు. ఇటీవల మీ ఇంట్లో బాంబ్ పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే మిమల్ని గిట్టని వారు మిమల్ని అంతం చేయాలని చూస్తున్నారు. మిమల్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మిమల్ని చంపాలి అనుకున్న వారు ఈ ఫైల్ ఏదో ఒకటి చేస్తారని అనుకున్నా అందుకే వాళ్ల కంటే ముందు నేను ఈ ఫైల్ తీసుకున్నా. తప్పు అనిపిస్తే క్షమించండి.
రూప: చాలా థ్యాంక్స్ రాజు.
సూర్య ప్రతాప్ నామినేషన్ పూర్తవుతుంది. రాజు మామ మెడలో దండ వేసి శుభాకాంక్షలు చెప్తాడు. రూపని తీసుకొని సూర్యప్రతాప్ వెళ్లిపోతాడు. ఇలా జరిగిందేంటని జీవన్ అంటే అంటే ఇంకెలా జరగాలి అనుకుంటున్నావ్ అని రాజు అంటాడు. అసలు నువ్వు పోటీ ఏంట్రా అని అంటాడు. వెటకారంగా నవ్వుతాడు రాజు.
రాజు: మీ అందరికీ చెప్తున్నా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా పెద్దాయన చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరు.
జీవన్: దండ విసిరేసి చేతుల దాకా వచ్చిన విజయం చేయి జారిపోయింది.
రేణుక: నువ్వు ఆలోచించాల్సింది సూర్యప్రతాప్ గురించి కాదు ఆయన పక్కనున్న రాజు గురించి. ఆయన పక్కన రాజు ఉంటే సపరేట్ ఆర్మీ ఉన్నట్లే.
గౌతమ్: అవును జీవన్ సూర్యప్రతాప్ని వేయాలి అంటే ఇలాంటి చిన్న చిన్న ప్లాన్స్ సరిపోవు పెద్ద ప్లాన్స్ వేయాలి.
శ్వేత: అవును అన్నయ్య ఈ విషయం ఇంతటితో వదిలేయ్ ఎలక్షన్ మీద ఫోకస్ పెడదాం.
రాజు ఇంటికి వెళ్లి నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగిందని కానీ ఎవరో ఆయన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నారని జరిగినంతా చెప్తాడు. ఇదంతా విజయాంబిక, దీపక్‌లే చేసుంటారని అప్పలనాయుడు అంటారు. దాంతో విరూపాక్షి డబ్బు కోసమే లేక ఇంకేదో దాని కోసమే ఆశ పడి ఇలా చేసుంటుందని అంటుంది. ఇక బాగా ఆలోచించిన రాజు ఇదంతా జీవన్, శ్వేతల పనే అని అంటాడు. ఇక మరోవైపు జీవన్, శ్వేత, గౌతమ్, రేణుకలు కలుస్తారు. సూర్యప్రతాప్‌ని నాశనం చేయాలి అంటే ఆయన కుటుంబ లొసుగులే మనకు ఏకైక దారి అని రేణుక సలహా ఇస్తుంది.
విరూపాక్షి: సూర్యని ఏం చేయలేరు కానీ సూర్యని బ్యాడ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి రాజు. వాటిని పట్టుకుంటే తట్టుకోవడం కష్టం.
రేణుక: పెద్దయ్య భార్యని వదిలేసి 25ఏళ్లు అయింది పెళ్లాన్ని మోసం చేసి వదిలేసిన వాడు మనల్ని ఏం పాలిస్తాడని ప్రజల్లోకి ఎక్కిద్దాం.
రాజు: పెద్దాయన భార్యని వదిలేసింది ఆమెను మోసం చేయడానికి కాదు ప్రజాసేవకే అని చెప్దాం. వాళ్లు విడిగా ఉన్నారే తప్ప విడిపోలేదని చెప్దాం.
రేణుక: కన్న కూతురికి పెళ్లి అయినా మొగుడు దగ్గర ఉంచకుండా తన దగ్గరే ఉంచుకున్నారు అంటే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని అడుగుదాం.
రాజు: వాళ్లిద్దరూ విడిపోవడానికి వారి అభిప్రాయం బేధాలే కారణం అని చెప్దాం.
రేణుక: ఆయన గారి అక్క మొగుడిని వదిలేసి పుట్టింట్లో ఉంటుంది. ఆయన మేనల్లుడు ఇంట్లో పని మనిషిని పాడు చేశాడని చెప్దాం. పరువుకి ప్రాణం ఇచ్చిన ఆయన పరువు పోయినా పదవి పోయినట్లే. కానీ వాళ్లని ఎంత బ్యాడ్ చేస్తే అంత మంచిది.
రాజు: వాళ్లు ఎంత బ్యాడ్ చేసినా మనం తిప్పి కొట్టాలి.
మరోవైపు మందారం హారతిని ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఇంటి ముందు సెక్యూరిటీని చూసిన హారతి ఇది కరెక్ట్ అడ్రసేనా అనుకొని మందారానికి కాల్ చేస్తుంది. మరోవైపు హారతి, విజయాంబిక అక్కడే మాట్లాడుకుంటుంటారు. జీవన్ ఫోన్ చేయడంతో దీపక్ వెళ్లిపోతాడు. ఇక విజయాంబిక హారతితో మాట్లాడుతుంది. న్యాయం కోసం వచ్చానని పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడని అందుకే వచ్చానని విజయాంబికకు చెప్తుంది. ఇలాంటి పంచాయితీలు ఇంటి వరకు ఎందుకని విజయాంబిక అంటుంది. వాళ్లు వెళ్లిపోగానే దీపక్ వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: Nara Rohith Wedding: ప్రేమలో పడిన సంగతి నారా రోహిత్ ముందు ఎవరికి చెప్పారో తెలుసా? పెళ్లి ఎప్పుడంటే?