Ammayi garu Serial Today May 30th: అమ్మాయి గారు సీరియల్: డీఎన్‌ఏ రిపోర్స్ మార్చేసిన దీపక్.. విరూపాక్షి, రుక్మిణిలను గెంటేసిన సూర్యప్రతాప్!
Ammayi garu Today Episode రుక్మిణి సూర్యప్రతాప్ కూతురే అని రిపోర్ట్స్ రావడం దీపక్ వాటిని మార్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ రుక్మిణిని కూర్చొపెట్టి తన కాళ్లకి మందు రాస్తారు. రుక్మిణిలా ఉన్న రూప తండ్రిని చూసి ఎమోషనల్ అయిపోతుంది. సూర్యప్రతాప్, రుక్మిణి ఇద్దరూ కన్నీరు పెట్టుకుంటారు. విజయాంబిక, దీపక్‌లు కోపంగా ఉంటారు.
రూప మనసులో చాలా హ్యాపీగా ఉంది నాన్న నీకు నిజం చెప్పాలి అన్నంత హ్యాపీగా ఉంది కానీ దానికి ఇంకా టైం ఉందని అనుకుంటుంది. బంటీ కూడా మందు రాస్తాను అంటాడు. రుక్మిణి వద్దని అంటే తాతయ్య తన బిడ్డకు రాస్తుంటే నీ బిడ్డ నీకు రాస్తాడమ్మా అని బంటీ అంటాడు. సూర్యప్రతాప్ బంటీకి మందు రాయమని చెప్తే బంటీ రూప చేతికి మందు పెడతాడు. రూపకి మందు రాస్తున్న బంటీ, సూర్యప్రతాప్‌ని చూసి విరూపాక్షి, రాజు వాళ్లు సంతోషపడతారు. హాస్పిటల్‌కి వెళ్లాలి కదా రాజు ఎందుకు తీసుకెళ్లలేదు సూర్యప్రతాప్ అడుగుతారు. దానికి రుక్మిణి దేవుడి దగ్గర జరిగిన గాయాలు తగ్గిపోతాయి అనుకున్నా కానీ దేవుడి లాంటి మీరు సేవ చేస్తారు అనుకోలేదు అని అంటుంది. సూర్యప్రతాప్ కన్నీరుపెట్టుకుంటారు.
సుమతో రుక్మిణిని జాగ్రత్తగా చూసుకోండి అని సూర్యప్రతాప్ చెప్పి వెళ్లిపోతారు. విజయాంబిక, దీపక్‌లు గదిలోకి వెళ్లి మీ మామయ్య కావాలి అంటే వేల మంది పని వాళ్లని పెట్టుకోగలరు కానీ ఆ రుక్మిణి కోసం కింద కూర్చొన్నాడు. ఆ రుక్మిణి కోసం సీఎం స్థానం నుంచి కామన్ మెన్ స్థానంలోకి దిగిపోయాడు ఆ రుక్మిణి సామాన్యురాలు కాదు అని అనుకుంటారు. డీఎన్‌ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోతే తనని గెంటేయకూడదు అని ఇలా మామయ్యతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిందని దీపక్ అంటాడు. విజయాంబిక దీపక్‌తో డీఎన్ఏ రిపోర్ట్స్ తెచ్చే వాడిని అడ్డుకొని వాటిని చూసి నెగిటివ్ వస్తే ఒకేకానీ పాజిటివ్ వస్తే వాటిని మార్చేద్దాం.. డబ్బుకి లొంగని వారు ఎవరూ ఉండరు కదా అని అంటుంది. అప్పటికీ ఒప్పుకోకపోతే ప్రాణం తీసేద్దామని బెదిరిద్దాం అని అంటుంది.
దీపక్ ఇంట్లో వాళ్లకి అనుమానం రాకుండా ఉండాలి అంటే నేను మాత్రమే వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండి వీళ్లని చూసుకో అని అంటాడు. దీపక్ హాస్పిటల్‌కి వెళ్లి ల్యాబ్‌లో ఉన్న వ్యక్తిని కలుస్తాడు. రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చావయని అతను చెప్తారు. దీపక్ షాక్ అయిపోతాడు. రిపోర్ట్స్ నెగిటివ్‌గా వచ్చినట్లు చెప్పమని అంటాడు. దీపక్‌ని వెళ్లిపోమని చెప్తారు. డబ్బు చూపించినా ఆయన లొంగరు దాంతో దీపక్ అతని కొడుకుని కిడ్నాప్ చేయించిన విషయం చెప్తాడు. డాక్టర్ షాక్ అయిపోతారు. నా కొడుకుని ఏం చేయొద్దని డాక్టర్ బతిమాలుతాడు. తాను చెప్పినట్లు చేయమని దీపక్ చెప్తాడు. దీపక్ ఇంటికి వెళ్లి విషయం తల్లికి చెప్తాడు. రుక్మిణి సూర్యప్రతాప్ కూతురేంట్రా అని విజయాంబిక షాక్ అయిపోతుంది. తను కచ్చితంగా రుక్మిణి కాదురా అది రూపే అయింటుందని విజయాంబిక అంటుంది. డాక్టర్‌ని బెదిరించానని దీపక్ చెప్తాడు.
రుక్మిణి ఉదయం బంటీకి టిఫెన్ తినిపిస్తుంది. సూర్యప్రతాప్ వాళ్లు అక్కడికి వస్తారు. రుక్మిణి తల్లి నీ ప్రేమ ముందు బంటీకి తగిలిన గాయం నా మనసుకు తగిలిన గాయం తగ్గిపోయావమ్మా అని అంటారు. విజయాంబిక కొడుకుతో వీళ్లంతా కలిసిపోతుంటే నా మనసుకి పెద్ద గాయం అవుతుందని రిపోర్ట్స్ వస్తే అయిపోతుందని అనుకుంటారు. డాక్టర్ రిపోర్ట్స్ తీసుకువస్తారు. దీపక్ వాళ్లు ఆ మార్చిన నెగిటివ్ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్‌ని బెదిరించి పంపేస్తాడు. డాక్టర్ మనసులో సొంత మనుషులకు ఇంత ద్రోహం చేశారు వీళ్లని దేవుడు వదలరు అని అనుకుంటారు. దీపక్ సూర్యప్రతాప్‌తో డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయని అంటాడు. అమ్మ డీఎన్‌ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోతే వెళ్లిపోతావా. నువ్వు నాతోనే ఉండు అమ్మా అంటాడు.
సూర్యప్రతాప్ రిపోర్ట్స్ చూడటానికి వెళ్తాడు. సూర్యప్రతాప్ రిపోర్ట్స్ చూస్తారు. అవి చూసి విరూపాక్షి అని అరుస్తాడు. ఏమైంది నాయనా అని రుక్మిణి అడిగితే నువ్వు నన్ను అలా పిలవకు. ఈ రుక్మిణిని నేను తండ్రి కాదు అని తేలిపోయింది అని అరుస్తాడు. ఇప్పుడేమంటావ్ రాజు అని సూర్యప్రతాప్ రిపోర్ట్స్ రాజుకి ఇస్తాడు. రాజు షాక్ అయిపోతాడు. రూపకి సైగ చేస్తాడు. విజయాంబిక విరూపాక్షితో నువ్వు నీ బిడ్డను తీసుకొని బయటకు వెళ్తే నీకు మర్యాదగా ఉంటుంది లేదంటే మెడ పట్టుకొని గెంటేస్తా అంటుంది. సూర్యప్రతాప్ ఇద్దరినీ గెంటేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీ బతకడానికి కారణమైన రుక్మిణిని రూపలా చూసుకుంటున్న సూర్యప్రతాప్..!





















