Ammayi garu Serial Today May 28th: అమ్మాయి గారు సీరియల్: కోమాలో బంటి.. తలగడ అడ్డుపెట్టి చంపే ప్రయత్నం చేసిన దీపక్ బంటీని చంపేశాడా!
Ammayi garu Today Episode దీపక్, విజయాంబికలు కోమాలో ఉన్న బంటీని చంపడానికి తలగడ అడ్డు పెట్టి ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్‌లు బంటిని చంపడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగా మెట్ల మీద నుంచి పడేలా చేస్తారు. బంటిని హాస్పిటల్‌లో చేర్పిస్తారు. బంటికి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. తనది సేమ్ బ్లడ్ గ్రూప్ అని బంటికి తల్లిలేని లోటు తీర్చుతా అని మాట ఇచ్చాను రక్తం ఇచ్చే అవకాశం ఇవ్వు నాయనా అని రుక్మిణి సూర్యప్రతాప్‌కి అడుగుతుంది. సూర్యప్రతాప్ సరే అనడంతో రక్తం ఇస్తుంది.
విరూపాక్షి తన మనవడికి ఏం కాకూడదని కోరుకుంటుంది. బంటినీ ఏం చేయొద్దు అంతగా ప్రాణం తీసుకోవాలి అని అనుకుంటే నా ప్రాణం తీసుకో స్వామి నా మనవడి ప్రాణంతో చలగాటం ఆడొద్దు అని వినాయకుడి ముందు కూలబడి ఏడుస్తుంది. సూర్యప్రతాప్, రాజు కూడా కన్నీరు పెట్టుకుంటారు. విజయాంబిక, దీపక్ నవ్వుకుంటారు. రుక్మిణి రక్తం ఇచ్చి బయటకు వస్తుంది. తల్లి ఏడ్వడం చూసి బంటికి ఏం కాదు నాన్న అని చెప్తుంది. విరూపాక్షి వాడు పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఆనందంగా లేడు. తల్లికి దూరంగా కొన్నాళ్లు.. తల్లీదండ్రులకు దూరంగా కొన్నాళ్లు.. ఇప్పుడిప్పుడే కదా అందరితో ఉంటున్నాడు. అసలైన లైఫ్ వాడికి పరిచయం చేశావ్ అనుకునే లోపు అన్యాయం చేశావ్ దేవుడా అని ఏడుస్తుంది.
డాక్టర్ బయటకు వస్తారు. బంటీకి ట్రీట్మంట్ అందించాం ఈపాటికే మెలకువ రావాలి కానీ రాలేదు. అందరూ షాక్ అయిపోతారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు బంటీకి ఏం కాకూడదని అంటారు. బంటీ బాడీ ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ కావడం లేదని బాబు ప్రస్తుతం కోమాలో ఉన్నాడని డాక్టర్ అంటారు. అందరూ నోరెళ్లపెడతారు. దేవుడి దయ అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతారు. దేవుడి దయ అని విన్న రూప అలియాస్ రుక్మిణి పరుగులు తీస్తుంది. ఈ టైంలో అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు అని రాజు ఫాలో అవుతాడు. రూప గుడికి వెళ్తుంది. చేతిలో హారతి వెలిగించుకొని దేవుడి ముందు నిల్చొని వాడు పుట్టగానే నాకు దూరం చేశావ్ ఇప్పుడు ఇలా చేస్తున్నావ్ అని అంటుంది. ఇంతలో రాజు వచ్చి అమ్మాయిగారు ఏం చేస్తున్నారు. వద్దు అని ఆపాలని ప్రయత్నిస్తాడు.
రూప తనని ఆపొద్దు అని చెప్తుంది. రాజు ఎంత చెప్పినా రూప వినదు. హాస్పిటల్‌లో నా బిడ్డని అలా చూస్తూ నేను ఉండలేను రాజు అని ఏడుస్తుంది. హాస్పిటల్‌లో విజయాంబిక, దీపక్‌లు సంతోషపడతారు. డాక్టర్ బంటీ చనిపోతాడు అని చెప్పలేదు. పొరపాటున వాడు బతికితే నా వల్ల ఇలా అయిందని చెప్పేస్తాడు. అందుకే వాడిని చంపేద్దాం సమయానికి రాజు, రుక్మిణిలు కూడా లేరు వాడిని ఏసేద్దాం అని అనుకుంటారు. ఇక రూప గుడి చుట్టూ పొర్లు దండాలు పెడుతుంది. రాజు వద్దని ఎంత చెప్పినా వినదు. రాజు బతిమాలుతాడు. అమ్మవారిని చూసి అమ్మ మా బంటి ఏం పాపం చేశావ్ అని ఇలాంటి పరిస్థితిలో పెట్టావ్ మా అమ్మాయిగారు ఏం చేశారు అని ఇలా ఇబ్బంది పడేలా చేస్తున్నావ్ నిజంగా నువ్వు ఉంటే నా బంటి కోలుకునేలా చేయమ్మా అని వేడుకుంటాడు.
నర్సు బయటకు వచ్చి మెడిసిన్ తీసుకురమ్మని చెప్తుంది. దీపక్, విజయాంబికలు వెళ్తారు. సూర్యప్రతాప్ దేవుడి దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటాడు. నా కోసం ఎప్పుడూ ఏం కోరుకోలేదు. మొదటి సారి నా కోసం కోరుకుంటున్నా బంటీ నా మనవడు మాత్రమే కాదు నా బిడ్డ నాకు అప్పగించిన బాధ్యత. ఇప్పటి వరకు అన్నీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాను. నా బిడ్డ నాకు అప్పగించిన బంటీ బాధ్యతలో నన్ను ఫెయిల్ చేయొద్దు స్వామి.. నా బిడ్డని దూరం చేశావ్. నా మనవడిలో నా బిడ్డని చూసుకుంటున్నా నా మనవడిని దూరం చేయకు స్వామి అని కోరుకుంటారు.
విజయాంబిక, దీపక్‌లు బంటీని చంపడానికి వెళ్తారు. ఇక రూప బంటీ కోసం నిప్పుల గుండం తొక్కుతుంది. రాజు ఏం వద్దని బతిమాలుతూనే ఉంటాడు. సూర్యప్రతాప్, విరూపాక్షి అందరూ దండం పెట్టుకుంటారు. పుట్టినప్పుడే చంపాలి అనుకున్నాం తప్పించుకున్నావ్ ఇప్పుడు తప్పించుకోలేవ్ అని తలగడ పట్టుకొని బంటి మీద పెట్టి దీపక్ నలిపేస్తాడు. విజయాంబిక ఎవరు రాకుండా చూస్తుంటుంది. ఇంతలో నర్సు ఆ గదిలోకి వెళ్తుంది. దాంతో విజయాంబిక, దీపక్‌లు దాక్కుంటారు. నర్సు మళ్లీ చూసి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్ ది లవ్ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్ ప్రశ్నలు!





















